OMG 2 Trailer: శివుడి అండగా కుమారుడి కోసం కోర్టులో పోరాటం.. ‘ఓ మై గాడ్‌ 2’ ట్రైలర్‌

అక్షయ్ కుమార్ (Akshay Kumar) కీలక పాత్రలో అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై గాడ్ 2’ (OMG 2 Movie). పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కాంతి శరణ్‌ ముగ్దల్‌ (పంకజ్‌ త్రిపాఠి) కుమారుడికి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. దీంతో అతడిని పాఠశాల నుంచి బహిష్కరిస్తారు. ఇంతకీ ఆ వీడియో ఏంటి? స్కూల్‌ నుంచి బహిష్కరణకు గురైన తన కుమారుడి కోసం ముగ్దల్‌ న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించాడు? అందుకు శివుడు (అక్షయ్‌ కుమార్‌) ఎలా సాయం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Updated : 03 Aug 2023 15:07 IST

Tags :

మరిన్ని