FIFA World Cup 2022: ఫైనల్లో ఉత్కంఠ రేపిన పెనాల్టీ షూటౌట్లు.. వీడియో

అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సూపర్‌స్టార్‌ మెస్సి స్వప్నం సాకారమైంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. షూటౌట్లో అర్జెంటీనా గోల్‌కీపర్‌ ఎమిలియానో మార్టినెజే హీరో. ఫ్రాన్స్‌ తరఫున మొదటి  పెనాల్టీని ఎంబాపె సద్వినియోగం చేయగా.. ఆ తర్వాత అర్జెంటీనా తరఫున మెస్సి స్కోర్‌ చేశాడు. ఆ తర్వాత ఫ్రాన్స్‌ తరఫున కోమన్‌ (రెండో పెనాల్టీ), చౌమని (మూడో పెనాల్టీ) వరుసగా విఫలం కావడంతో అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కోమన్‌ షాట్‌ను కుడివైపునకు దూకుతూ మార్టినెజ్‌ అడ్డుకోగా.. చౌమన్‌ షాట్‌ను బయటికి కొట్టాడు. అర్జెంటీనా తరఫున రెండు, మూడో ప్రయత్నాల్లో డిబలా, పరేదెస్‌ విజయవంతం కావడంతో ఆ జట్టు 3-1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో పెనాల్టీని సద్వినియోగం చేయడం ద్వారా కోలో మౌని ఫ్రాన్స్‌ ఆశలను (2-3) సజీవంగా ఉంచాడు. కానీ తర్వాత మాంటియల్‌.. ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడంతో ప్రపంచకప్‌ అర్జెంటీనా సొంతమైంది.

Updated : 19 Dec 2022 10:12 IST

Tags :

మరిన్ని