AP Employees: ఆర్థిక సంవత్సరం ముగింపు.. వేతనాల కోసం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన!

నెలాఖరు వస్తుందంటే చాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో(Ap Employees) కలవరం మొదలవుతోంది. ఈనెల అయినా సకాలంలో జీతాలు పడతాయా లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీతాలు(Salaries), బిల్లులు అన్నీ సక్రమంగా సమర్పిస్తేనే ప్రతినెలా 20వ తారీఖు వరకు వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండగా ఆర్థిక సంవత్సరం చివరి ఏడాది కావడంతో చాలా రోజులుగా సీఎఫ్‌ఎంఎస్‌ (CFMS).వెబ్‌సైట్‌ మూతపడింది. సోమవారం రాత్రి మాత్రమే ఈ వెబ్‌సైట్‌ను ఖజనా అధికారులకు అందుబాటులో ఉంచారు. బిల్లులు సమర్పణకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చారు. దీంతో ఈనెల జీతాలు సకాలంలో రాక పోవచ్చన్న చర్చ ఉద్యోగుల్లో నెలకొంది.

Updated : 30 Mar 2023 12:40 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు