Thani Oruvan 2: హిట్‌ సినిమాకి సీక్వెల్‌.. ఆసక్తి రేకెత్తించేలా అనౌన్స్‌మెంట్‌ వీడియో

తమిళ హిట్‌ చిత్రం ‘తని ఒరువన్‌’ (Thani Oruvan)కు సీక్వెల్‌ అధికారికంగా ఖరారైంది. తొలి పార్ట్‌ విడుదలై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం పార్ట్‌ 2 (Thani Oruvan 2)ని ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘తని ఒరువన్‌’లో నటించిన జయం రవి (Jayam Ravi), నయనతార (Nayanthara) సీక్వెల్‌లోనూ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మోహన్‌ రాజా దర్శకుడు. ‘తని ఒరువన్‌’.. ‘ధ్రువ’ (రామ్‌ చరణ్‌ హీరో) పేరుతో తెలుగులో రీమేక్‌ అయి, ఇక్కడా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Published : 28 Aug 2023 19:18 IST

Tags :

మరిన్ని