Uttarakhand: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్య.. భాజపా నేత కుమారుడి అరెస్ట్‌

ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్ హత్య కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. 19 ఏళ్ల యువతి హత్య కేసులో స్థానిక భాజపా నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య సహా ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యోదంతంపై ప్రతిపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ.. ముందుగానే అప్రమత్తమైన పుష్కర్ సింగ్ థామి ప్రభుత్వం.. కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసి.. దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

Published : 24 Sep 2022 14:55 IST

Tags :

మరిన్ని