తమన్నా

Updated : 10 Sep 2021 15:33 IST
1/26
కథానాయికగా తెలుగువారికి చేరువైన తమన్నా వ్యాఖ్యాతగానూ అలరిస్తున్నారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారం అవుతున్న వంటల కార్యక్రమానికి ఆమె యాంకర్‌గా అదరగొడుతున్నారు. కథానాయికగా తెలుగువారికి చేరువైన తమన్నా వ్యాఖ్యాతగానూ అలరిస్తున్నారు. ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారం అవుతున్న వంటల కార్యక్రమానికి ఆమె యాంకర్‌గా అదరగొడుతున్నారు.
2/26
మిల్కీబ్యూటీ తమన్నా తొలి సినిమా ‘శ్రీ’ (2005). మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఆశించిన విజయం‌ అందుకోలేకపోయింది.

3/26
2007లో ‘హ్యాపీడేస్‌’తో తెలుగులో బ్రేక్‌ అందుకున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్‌’, ‘రచ్చ’, ‘బాహుబలి’ తదితర సినిమాలతో స్టార్‌గా ఎదిగారు.

4/26
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషా చిత్రాల్లోనూ తమన్నా నటిస్తున్నారు. అక్కడ కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు.

5/26
గోపిచంద్‌తో ఆమె కలిసి నటించిన  ‘సీటీమార్‌’ వినాయకచవితి కానుగా విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది

6/26
తమన్నా తెలుగులో సత్యదేవ్‌తో ‘గుర్తుందా సీతాకాలం’, ‘ఎఫ్‌3’ సినిమాల్లో నటిస్తోంది.

7/26
నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న అంధాధున్‌ తెలుగు రీమేక్‌ ‘మ్యాస్ట్రో’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న అంధాధున్‌ తెలుగు రీమేక్‌ ‘మ్యాస్ట్రో’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
8/26
సంతోష్ భాటియా, రజనీ దంపతులకు 1989 డిసెంబర్‌ 21న తమన్నా జన్మించారు. ఆమె తండ్రి వజ్రాల వ్యాపారవేత్త.

9/26
2005లో బాలీవుడ్‌ చిత్రం ‘చాంద్‌ సా రోషన్ చెహ్రా’తో హీరోయిన్‌గా మొదటిసారి వెండితెరకు పరిచయమైన తమన్నా.. అదే ఏడాది ‘శ్రీ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.

10/26
ఇండియన్‌ ఐడిల్‌-1 విజేత అభిజీత్‌ సావంత్‌తో కలిసి ఓ ఆల్బమ్‌లో తమన్నా ఆడిపాడారు. 2005లోనే ఇది విడుదలయ్యింది.

11/26
2006లో విడుదలైన ‘కేడీ’తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తమన్నా. తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ సినిమాలో తమన్నా ప్రతినాయిక లక్షణాలు ఉన్న పాత్రలో నటించారు.

12/26
‘‘కథానాయికగా నేను అన్నిరకాల దుస్తులను ధరించాల్సి వస్తుంది. దీనివల్ల నాకు అటు ట్రెండీగా ఉండే ఫ్యాషన్‌ వస్త్రాలతో పాటు.. ఇటు సంప్రదాయ దుస్తులూ నచ్చుతాయి’’

13/26
‘‘పరికిణీ అంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ‘100% లవ్‌ ’ చిత్రంలో నాకెంతో ఇష్టమైన లంగావోణిలోనే ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాను’’

14/26
‘‘ఇండస్ట్రీలో ఉన్న అందరితోనూ నేను బాగా మాట్లాడతాను. ముఖ్యంగా పరిశ్రమకు చెందిన వారిలో కాజల్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. మేమిద్దరం ఎప్పుడు ఎక్కడ కలిసినా సరే మా మధ్య మాటలు అలా సాగిపోతుంటాయి’’

15/26
‘‘శ్రుతిహాసన్‌, సమంత.. కూడా నాకు స్నేహితులు. కథానాయకుల విషయానికి వస్తే ప్రభాస్‌ నాకు మంచి మిత్రుడు. ఇక ముంబైలోని మా అపార్ట్‌మెంట్‌లో ఉండే వారందరూ నాకు దోస్తులే’’

16/26
‘‘నన్ను ఇష్టపడే ఎంతో మంది అభిమానులు నన్ను ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే.. ‘మిల్కీ బ్యూటీ’ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది’’

17/26
‘‘శరీరఛాయను ఆధారంగా చేసుకుని ఓ మనిషిని ముద్దుపేర్లతో పిలవడం నాకు ఇష్టం ఉండదు.’’

18/26
‘‘షూటింగ్స్‌ ఏమీ లేనప్పుడు.. ఖాళీ సమయం దొరికితే నాకు బద్ధకం వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ల బుద్ధి కాదు. ముంబయిలో ఉన్న నా స్నేహితులు.. ‘నువ్వు ఎందుకే బయటకు రావు’ అని తెగ బాధపడిపోతుంటారు’’

19/26
‘‘ఇంట్లో ఉంటే టీవీ కూడా చూడాలనిపించదు. మార్నింగ్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వర్కౌట్లు చేస్తా. మొదట్లో అప్పుడప్పుడూ సోషల్‌మీడియా అకౌంట్లు తిరగేసే దాన్ని. కానీ లాక్‌డౌన్‌ సమయంలో ఇన్‌స్టా, ట్విటర్‌.. ఎక్కువగా ఫాలో అవుతున్నా.’’

20/26
‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఆసక్తి ఉంది. మ్యూజిక్‌ వినపడితే చాలు.. వెంటనే స్టెప్పులేసేయాలనిపించేది. పాటలు కూడా పాడేస్తుంటాను. కానీ, డ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు’’

21/26
‘‘చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేయడం వల్ల.. సెట్స్‌లోనే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. సెట్‌లో చేసిన ప్రాక్టీస్‌తోనే డ్యాన్స్‌ నేర్చుకున్నా’’

22/26
‘‘‘జై లవకుశ’లోని ‘స్వింగ్‌ జరా’, ‘సరిలేరు నీకెవ్వరు’లోనా పార్టీ సాంగ్‌ ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చాయి.’’

23/26
‘‘షూటింగ్స్‌లో భాగంగా వేరే దేశాలకు వెళ్లి వస్తుంటాను. షెడ్యూల్‌లో భాగంగా అక్కడ ఉన్నన్ని రోజులు లొకేషన్స్‌లో మాత్రమే ఉంటాం’’

24/26
‘‘ఏ దేశానికైతే వెళ్తానో.. అక్కడ పేరుపొందిన ప్రాంతాలను చూడాలని ప్రతిసారీ అనుకుంటాను. ఎప్పుడూ కుదరలేదు. కానీ నాకు అమెరికా అంటే ఎంతో ఇష్టం. హాలీడే కోసం అక్కడి వెళ్తుంటాను.’’

25/26
తమన్నా తమన్నా
26/26
తమన్నా తమన్నా

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు