ఈ హోటల్‌ని... ఉప్పుతో కట్టారు..!

పర్యటకులు ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడానికి హోటల్‌కి వెళ్తారు. కానీ బొలీవియాలోని ‘పాలాసియో డి సాల్‌’ అనే హోటల్‌కి మాత్రం దాన్ని చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అంత గొప్ప ఏమిటటా అంటే...

Updated : 22 May 2022 06:21 IST

ఈ హోటల్‌ని... ఉప్పుతో కట్టారు..!

పర్యటకులు ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడానికి హోటల్‌కి వెళ్తారు. కానీ బొలీవియాలోని ‘పాలాసియో డి సాల్‌’ అనే హోటల్‌కి మాత్రం దాన్ని చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అంత గొప్ప ఏమిటటా అంటే... ఆ హోటల్‌లోని గోడలూ, పైకప్పూ మొదలు కుర్చీలూ, టేబుళ్ల వరకూ అన్నీ ఉప్పుతో చేసినవే. ప్రపంచంలోనే ఏకైక సాల్ట్‌ హోటల్‌ ఇదేనట. విశాలమైన పన్నెండు గదులూ, డైనింగ్‌ హాలూ, గోల్ఫ్‌కోర్సూ, ఈతకొలనూ వంటి సకల సౌకర్యాలతో తెల్లటి ఉప్పుతో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇక్కడి ‘సలార్‌ డి ఉయునీ’ ఉప్పు ఎడారిని చూడ్డానికి వచ్చే సందర్శకుల్ని ఆకర్షించడానికే దీన్ని నిర్మించారు. ‘అది సరే కానీ మరి ఉప్పు కరిగిపోదా!’ అంటారేమో అలా జరగకుండా ఉండేందుకే ఉప్పు ఇటుకల్ని ఫైబర్‌గ్లాస్‌కు జత చేసి తయారుచేశారట. ఇతర జాగ్రత్తలూ పాటిస్తారట. వచ్చే సందర్శకులకు ‘దయచేసి గోడల్ని నాకొద్దు’ అంటూ సరదాగా చెబుతుంటారు ఈ హోటల్‌ నిర్వాహకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..