మతిమరుపు... మందార టీ!

చలికాలంలో ఎర్రని మందార పూల టీ తాగడం వల్ల శరీరంలో వేడి పుట్టడంతోపాటు రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated : 08 Jan 2023 04:23 IST

మతిమరుపు... మందార టీ!

చలికాలంలో ఎర్రని మందార పూల టీ తాగడం వల్ల శరీరంలో వేడి పుట్టడంతోపాటు రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే తాజాగా మందార టీ చేసే మేలులో మరొకటి చేరింది అంటున్నారు దక్షిణ కొరియాలోని పొహంగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన నిపుణులు. రోజూ ఓ కప్పు మందార పూల టీ తాగితే ఆల్జీమర్స్‌నీ అడ్డుకోవచ్చట. ఇందులోని గాసీపెటిన్‌ అనే పదార్థం మతిమరుపునకు కారణమైన అమిలాయిడ్‌ ప్రొటీన్‌ పేరుకోకుండా చూస్తుందట. ఈ విషయాన్ని ఎలుకల్లో ప్రయోగ పూర్వకంగా పరిశీలించి మరీ స్పష్టీకరిస్తున్నారు. పైగా గాసీ పెటిన్‌ సాయంతో మతిమరపునకు కారణమైన అమిలాయిడ్‌ ప్రొటీన్‌ నిల్వల్ని తొలగించవచ్చనీ, తద్వారా ఆల్జీమర్స్‌ చికిత్సకీ ఎంతో ఉపయోగపడుతుందనీ చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..