హహ్హహ్హ

ప్రియుడు: డార్లింగ్‌... నీకు శాకాహారం ఇష్టమా లేక మాంసాహారమా... ప్రియురాలు: ఆ రెండూ కాదు...

Updated : 10 Apr 2022 06:01 IST

హహ్హహ్హ

ఇష్టమే

ప్రియుడు: డార్లింగ్‌... నీకు శాకాహారం ఇష్టమా లేక మాంసాహారమా...
ప్రియురాలు: ఆ రెండూ కాదు...
ప్రియుడు: మరి...
ప్రియురాలు: వజ్రాల హారం అంటే ఇష్టం...


ఆస్తి కాదు...

సువర్ణ: ఇల్లరికపు అల్లుడు కావాలని అడుగుతున్నావ్‌. మీకు అంత ఆస్తి ఉందా...
రాధ: ఆస్తి కాదు వదినా బోలెడంత పని ఉంది!


నేను చేయలేదు!

ట్రాఫిక్‌ పోలీసు: రోడ్డు దాటుతూ ఫోన్‌ మాట్లాడకూడదని తెలియదా...

వెంగళప్ప: తెలుసండీ. అందుకే నేను చెయ్యలేదు, అవతలి వాళ్లు చేస్తేనే మాట్లాడుతున్నా!


ఏం చేస్తుంటారు?

టీచర్‌: మీ నాన్న ఏం చేస్తుంటారు? 

విద్యార్థి: మా అమ్మ చెప్పినవన్నీ చేస్తుంటారు.


సెలవు కావాలి

రామారావు: సార్‌! సెలవు కావాలి.. తిరుపతికి వెళ్లాలనుకుంటున్నా..

బాస్‌: కిందటి నెలే కదా.. వారం రోజులు సెలవు పెట్టి తిరుపతికి వెళ్లొచ్చావు. మళ్లీ తిరుపతికా...

రామారావు: అవును... క్షేమంగా ఇంటికి చేరితే మళ్లీ వస్తానని మొక్కుకున్నా సార్‌.


తెలిసిపోయింది!

భార్య: మన సంపాదన ఎందుకు సరిపోవడం లేదో ఇన్నాళ్లకు అర్థమయిందండీ...

భర్త: అవునా... ఎందుకంటావు?

భార్య: నేను ఖర్చు పెట్టినంత వేగంగా మీరు సంపాదించలేక పోతున్నారు కాబట్టే!


అంతేగా...

కొడుకు: తోడల్లుడు అంటే ఎవరు నాన్నా...
తండ్రి: ఒకే కంపెనీ వల్ల మోసపోయిన ఇద్దరు కస్టమర్లు రా...


పెళ్లైన ఆడవాళ్లకు రెండు సలహాలు...

మొదటిది...

మీ భర్త సెలక్షన్లు చూసి నవ్వకండి. ఎందుకంటే వాటిలో మీరు కూడా ఒకటి.

రెండోది... మీ సెలక్షన్లను చూసుకుని గర్వపడకండి. ఎందుకంటే అందులో మీ భర్త కూడా ఒకటి.


తెలుగు పరీక్ష

ఒకసారి తెలుగు భాషలో పోటీ పరీక్ష నిర్వహించారు. ఆ పోటీ పరీక్షలో 20 వేలమంది మేధావులు పాల్గొన్నారు.

పోటీ ఏమిటంటే... శాంతి, సంతోషం, నిశ్శబ్దం... ఈ మూడింటికీ అర్థం వచ్చేలా ఒక వాక్యం ఉండాలి.

అవార్డు గ్రహీత ఈ విధంగా రాశాడు... ‘నా భార్య నిద్రపోతోంది’.

న్యాయ నిర్ణేతలు అవార్డు గ్రహీతని ఆనందబాష్పాలతో హృదయానికి హత్తుకుని అవార్డు బహూకరించారు.


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మేనేజర్‌: ఏమయ్యా... ఎంత వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అయితే మాత్రం నీకసలు బాస్‌ అంటే విలువ లేదే. ఫోన్‌ చేస్తే మీ ఆవిడ ఎత్తి- ‘వంట చేస్తున్నారు, తర్వాత మాట్లాడండి’ అంది. వంటయ్యాక అయినా నువ్వు ఫోన్‌ చేయాలా వద్దా?

ఉద్యోగి: నేను చేశాను సార్‌. కానీ మీ శ్రీమతి ఫోన్‌ మాట్లాడి ‘అంట్లు తోముతున్నారు, తర్వాత మాట్లాడండి’ అని చెప్పారు.


అందుకే వెళ్లింది

టీచర్‌: సీత రాముడితో అడవికి ఎందుకు వెళ్లిందో ఎవరైనా చెప్పగలరా..

బంటి: ఇంట్లో ముగ్గురు అత్తలు ఉన్నప్పుడు అడవే మేలని వెళ్లి ఉంటుంది టీచర్‌.


ఆడవాళ్ళకి బుర్రలేదా!

సుమతి శివుడి కోసం ఘోర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె మూడు వరాలు కోరుకుంది. ‘సరే ఇస్తాను కానీ నీకు ఇచ్చిన వరాలేమైనా అంతకు పది రెట్లు తనకి కావాలని మీ అత్తగారు వరం కోరుకుంది’ అని చెప్పాడు. సరేనంది సుమతి. ముందుగా తనకి పదికోట్లు డబ్బు కావాలంది. ఆమె అత్తగారికి వందకోట్లు వచ్చాయి. తను చాలా అందంగా ఉండాలని కోరుకుంది. అత్తగారు కోడలికన్నా పదిరెట్లు అందంగా తయారయ్యారు. మూడో వరంగా తనకి మైల్డ్‌గా హార్ట్‌ ఎటాక్‌ రావాలని కోరుకుంది సుమతి.

ఆమె అత్తకి పదిరెట్లు ఎక్కువగా గుండెపోటు వచ్చేసరికి ఆమె పోయింది. అప్పటినుంచి ఇప్పటివరకూ శివుడు త్రిశూలం పట్టుకుని వెతుకుతూనే ఉన్నాడు ‘ఆడవాళ్లకి బుర్రలేదని ఎవరన్నారో తేల్చుకోడానికి’.


అవునా!

మీ బరువు భూమి మీద 70 కేజీలైతే మార్స్‌ మీద 26 కేజీలు... చంద్రుడి మీద 11 కేజీలు... సో, లావుగా ఉండటం మన ప్రాబ్లమ్‌ కాదు. ఉండకూడని గ్రహం మీద ఉండడమే ప్రాబ్లమ్‌ అంతానూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..