Smart Track Shoes: ఈ బూట్లతో జాడ తెలుసుకోవచ్చు!

చిన్నపిల్లలు స్కూలు నుంచి సమయానికి రాకపోయినా, ఏ పార్కుకో వెళ్లిన పెద్దవాళ్లు ఎప్పటిలా ఇంటికి చేరుకోకపోయినా.... కాస్త ఆందోళన పడుతుంటాం.

Updated : 27 Nov 2022 14:58 IST

Smart Track Shoes: ఈ బూట్లతో జాడ తెలుసుకోవచ్చు!

చిన్నపిల్లలు స్కూలు నుంచి సమయానికి రాకపోయినా, ఏ పార్కుకో వెళ్లిన పెద్దవాళ్లు ఎప్పటిలా ఇంటికి చేరుకోకపోయినా.... కాస్త ఆందోళన పడుతుంటాం. ఆ గాబరా లేకుండా నిశ్చింతగా ఉండాలంటే వాళ్ల జాడను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏదైనా ఏర్పాటు ఉంటే బాగుంటుంది కదూ. అందుకు పరిష్కారంగానే ‘జీపీఎస్‌ స్మార్ట్‌సోల్‌ ట్రాకర్‌’, ‘స్మార్ట్‌ ట్రాక్‌ షూ’ వచ్చాయి. బూట్లలోనే ఇమిడి ఉండే ఈ జీపీఎస్‌ ట్రాకర్‌ని ఫోన్‌ ద్వారా అటాచ్‌ చేసుకుంటే చాలు. ఎప్పటికప్పుడు వాళ్లు ఎక్కడున్నారో అందులో ఇట్టే కనిపిస్తుంది. ఇదివరకే బిళ్లల్లాంటి జీపీఎస్‌ ట్రాకర్లు ఉన్నా... చిన్న చిప్‌ రూపంలో ఉండే ఇవైతే- బూట్లలో ఇమిడిపోయి ఉంటాయి కాబట్టి వాటిని బ్యాగుకో, డ్రెస్సుకో ప్రత్యేకంగా విడిగా పెట్టుకోనవసరం లేదు. బయటకీ కనిపించకుండా ఉంటాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌సోల్‌ ట్రాకర్లు రకరకాల సైజుల్లో దొరుకుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..