అలల అంచున అందాల పల్లె!

ఒకవైపు పర్వతాలు... మరోవైపు సముద్రం..సరిగ్గా ఈ రెండింటి మధ్యలో ఎగసిపడే నీలి అలల్లోకి చొచ్చుకుని ఉన్న చిన్న భూభాగమే ఫ్లటెరై. ఐస్‌లాండ్‌లోని ఓ చిన్న పల్లెటూరు ఇది. దాదాపు 300 మంది జనాభాతో ఉండే

Updated : 13 Feb 2022 06:21 IST

అలల అంచున అందాల పల్లె!

కవైపు పర్వతాలు... మరోవైపు సముద్రం..సరిగ్గా ఈ రెండింటి మధ్యలో ఎగసిపడే నీలి అలల్లోకి చొచ్చుకుని ఉన్న చిన్న భూభాగమే ఫ్లటెరై. ఐస్‌లాండ్‌లోని ఓ చిన్న పల్లెటూరు ఇది. దాదాపు 300 మంది జనాభాతో ఉండే ఈ ఊళ్లో మామూలు కాలాల్లో అడుగుపెట్టామంటే ఎటుచూసినా పరవశింపచేసే ప్రకృతిదృశ్యాలే దర్శనమిస్తాయి. అదే చలికాలం వచ్చిందంటే మాత్రం ఊరే కాదు, చుట్టూ ఉన్న పర్వతాలతో సహా ఆ ప్రాంతమంతా మంచు దుప్పటి కప్పినట్టే కనిపిస్తుంది. సాధారణంగా కొన్ని ప్రాంతాలు కొన్ని సీజన్లలోనే పర్యటకుల్ని ఆకర్షిస్తుంటాయి. కానీ ఈ చిన్న పల్లె మాత్రం ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణంతో చూపరుల్ని కట్టిపడేస్తుంది. అందుకే సాహసికులు ఇక్కడ పర్వతాల మీద ట్రెక్కింగ్‌ చేయడానికీ... ప్రకృతి ప్రేమికులు సంద్రపు కెరటాల సవ్వళ్లు వినడానికీ... ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. చేపల వేటా, బొమ్మల తయారీ ప్రధాన వృత్తులైన ఈ పల్లెలో అలనాటి వస్తువులూ, రకరకాల బొమ్మలతో ఉండే మ్యూజియాలూ ఉంటాయి. రుతువుల్ని బట్టి దుస్తులు మార్చుకున్నట్టుగా శీతకాలంలో మంచు దుప్పటి మాటున ఒదిగిపోతూ మిగిలిన సమయాల్లో కళకళలాడే చెట్లూచేమలతో భూమమ్మకు పచ్చచీర సింగారించినట్లుగా మురిపించే ఈ ఊరు ఎవరికైనా నచ్చేయదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..