వాతావరణమూ కారణమే!

సరైన  వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మధుమేహం, బీపీ... వంటివాటినే ఇంతవరకూ గుండెజబ్బులకు కారణాలుగా పేర్కొన్నారు హృద్రోగనిపుణులు.

Published : 14 Jan 2023 23:48 IST

వాతావరణమూ కారణమే!

సరైన  వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మధుమేహం, బీపీ... వంటివాటినే ఇంతవరకూ గుండెజబ్బులకు కారణాలుగా పేర్కొన్నారు హృద్రోగనిపుణులు. అందుకే ఆయా అంశాలపట్ల అవగాహన కలిగించడం ద్వారా గుండెజబ్బు మరణాలను తగ్గించగలిగారు కూడా. కానీ గుండెజబ్బు మరణాలకు వాతావరణం కూడా ఓ కారణమవుతుందనీ దాన్నెలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదనీ చెబుతున్నారు బోస్టన్‌లోని హార్వర్డ్‌ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే- ఐదు ఖండాల్లో 27 దేశాల్లో 567 నగరాల్లో గత యాభై ఏళ్లుగా సంభవిస్తోన్న గుండెజబ్బు మరణాలను పరిశీలించినప్పుడు- అవన్నీ ఎక్కువగా విపరీతమైన వేడీ, తీవ్రమైన చలీ
ఉన్న కాలంలోనే సంభవించిన్నట్లు గుర్తించారు. ఈ రెండు రకాల వాతావరణ పరిస్థితుల వల్ల గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు సన్నబడి గుండెనొప్పి, స్ట్రోక్‌, ఆకస్మిక గుండెపోటు వచ్చి... మరణిస్తున్నారట. ముఖ్యంగా చలికాలంలో వీటి రేటు మరీ ఎక్కువగా ఉంటుందట. ప్రతి వందమందిలో ఒకరు వాతావరణం వల్లే మరణిస్తున్నారని మేరీల్యాండ్‌ యూనివర్సిటీ నిపుణులూ చెబుతున్నారు. కాబట్టి గుండెజబ్బులు ఉన్నవాళ్లు బయట వాతావరణంలో ఎక్కువగా తిరగకపోవడం ఇంట్లో కూడా ఉష్ణోగ్రత సమంగా ఉండేలా చూసుకోవడం... వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..