సిల్లీ పాయింట్‌

అమెరికాలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునేవారిలో స్త్రీలే ఎక్కువ... 69 శాతం వాళ్లే ఉంటారట!

Published : 27 Feb 2022 00:18 IST

సిల్లీ పాయింట్‌

అమెరికాలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునేవారిలో స్త్రీలే ఎక్కువ... 69 శాతం వాళ్లే ఉంటారట!

* భారతదేశంతోపాటూ శ్రీలంక, నేపాల్‌, సీషెల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లోనూ... డబ్బుని ‘రూపాయి’ అనే అంటారు.
* కంప్యూటర్‌లో టైప్‌ చేసేటప్పుడు సగటున ప్రతి పది క్షణాలకోసారి... స్పేస్‌బార్‌ని నొక్కుతారని ఓ అంచనా!
* 1950ల దాకా సినిమాల్లో సూర్యుణ్ణి చూపించేవారు కాదు. సూర్యుడివైపు కెమెరా తిప్పితే ఫిల్మ్‌లు కాలిపోతాయని భయపడేవారు. ఆ భయాన్ని వీడి తొలిసారి కెమెరాలో సూర్యుణ్ణి బంధించినవాడు ప్రఖ్యాత జపనీస్‌ దర్శకుడు అకీరా కురొసవా. ఆ చిత్రం ‘రషొమోన్‌’!
* ఇల్లు కట్టుకోవడం కోసంరుణాలిచ్చే విధానం... 1870లో అమెరికాలోనే మొదలైంది. ఆ పద్ధతి మనదేశంలో అడుగుపెట్టడానికి మరో వందేళ్లు పట్టాయి. 1970లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తొలి గృహరుణం అందించింది.
* నాట్యం చేయడం ఒక్క మనుషులకే కాదు... పక్షులకూ తేనెటీగలకూ వచ్చు!
* కరోనాతో వర్క్‌ఫ్రమ్‌హోమ్‌లు ఎక్కువయ్యాక అమెరికన్‌ ఆఫీసుల్లో మగవాళ్లు క్యాజువల్‌ డ్రెస్‌లు వేసుకురావడం పెరిగిందట. అదే సమయంలో... అమ్మాయిలు మాత్రం సూట్‌తోపాటూ ఇదివరకు ఎన్నడూలేని విధంగా టై కట్టుకోవడం పెరిగిందట! ఇప్పుడు ఇదే అక్కడ కొత్త ఆఫీస్‌ ఫ్యాషన్‌ అట!
* 16వ శతాబ్దంలో తొలిసారి పుస్తకాలని అచ్చువేసేటప్పుడు... వాటిని హృదయాకారంలోనే రూపొందించారు!
* తుర్కమెనిస్తాన్‌ దేశంలోప్రజలకి కరెంటే కాదు... గ్యాస్‌ కూడా పూర్తి ఉచితంగానే అందిస్తారు!  
* ప్రపంచంలో అతిపెద్ద ‘దీవుల’ దేశం ఇండోనేషియానే. చిన్నాచితకవన్నీ కలిపి 17 వేల పైచిలుకు దీవులున్నాయక్కడ!!
* కర్ణాటక కూర్గ్‌లోని కొడగు తెగ ప్రజలు- పిల్లలు పుట్టినప్పుడు ఆ ఆనందాన్ని వ్యక్తంచేయడానికి గాల్లోకి కాల్పులు జరుపుతారు! ఆ ఆచారాన్ని గౌరవించే- ఆ ప్రజలకి లైసెన్సులేకున్నా సరే తుపాకులు ఉపయోగించొచ్చని మినహాయింపునిచ్చింది బ్రిటిష్‌ ప్రభుత్వం. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది!


అంబాసిడర్‌ కార్లు గుర్తున్నాయా? వాటిని ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో వాడుతున్న ఏకైక నగరం... కోల్‌కతానే!


ప్రపంచం మొత్తం మీద చూస్తే- సినీ నటులు రాజకీయ నాయకులుగా మారడం మనదేశంలోనే ఎక్కువ! ఆ తర్వాతి స్థానం...ఫిలిప్పైన్స్‌ది. హాలీవుడ్‌ ఉన్న అమెరికాది మూడో స్థానం!


జడ్‌ ప్లస్‌... మనదేశంలో కల్పించే అత్యున్నత భద్రతా వలయం ఇది. ప్రధాన మంత్రీ, మంత్రులూ, ప్రతిపక్ష నేతలకి ఈ భద్రత కల్పిస్తారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ సెక్యూరిటీని కలిగిన ఏకైక వ్యక్తి ముకేశ్‌ అంబానీ!


జపాన్‌ పిల్లలు దాదాపు ఏడెనిమిదేళ్లకే 20 దాకా ఎక్కాలు నేర్చుకుంటారు. ఎలా అంటే... అక్కడ ఎక్కాలని ‘కుకూ’ అన్న పాటగా నేర్పిస్తారు మరి!


పసిఫిక్‌ మహాసముద్రంలో తాహితి అనే పెద్ద దీవి ఉంది. అక్కడి నారింజలు నిమ్మపండంతే ఉన్నా... ఆరెంజ్‌ రంగులో మిలమిలా మెరుస్తుంటాయి. కానీ రుచిమాత్రం అచ్చం పైనాపిల్‌లా ఉంటుంది!


ఉక్రెయిన్‌... పొద్దుతిరుగుడు పూల దేశం! ప్రపంచంలో ఆ విత్తనాలని అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రాంతం ఇదే!


డైనోసార్లు మళ్లీ మన భూమి మీద  బతికి బట్టకట్టాలంటే... ఇప్పుడున్నదానికంటే రెట్టింపు ఆక్సిజన్‌ కావాలి, ఇప్పటికన్నా మూడురెట్లు ఎక్కువ వేడి కావాలి! 6.5 లక్షల ఏళ్లకిందట అవి జీవించిన కాలంలో భూవాతావరణం అలాగే ఉండేది మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..