జింకలతో సరదాగా ఓ ఫోటో

చెంగుచెంగున పరుగులు తీసే జింక పిల్లను చూస్తే భలే ముద్దొస్తుంది. మన ఉనికిని గమనించగానే పారిపోయే ఆ జింకల్ని దగ్గర్నుంచి చూడటమూ, సరదాగా వాటితో ఫొటోలు దిగడమూ అనేది అసలు కుదిరే పని కాదు.

Published : 01 Apr 2023 23:46 IST

జింకలతో సరదాగా ఓ ఫోటో

చెంగుచెంగున పరుగులు తీసే జింక పిల్లను చూస్తే భలే ముద్దొస్తుంది. మన ఉనికిని గమనించగానే పారిపోయే ఆ జింకల్ని దగ్గర్నుంచి చూడటమూ, సరదాగా వాటితో ఫొటోలు దిగడమూ అనేది అసలు కుదిరే పని కాదు. కానీ జపాన్‌లోని నారా నగరంలో అది సాధ్యమే. పన్నెండువందల ఎకరాల్లో జింకల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కులో అవి హాయిగా విహరిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతానికే చెందిన సికా జాతి జింకల్ని పవిత్ర దేవదూతలుగా కొలుస్తారు ఇక్కడి ప్రజలు. 1637 వరకూ వాటిని హింసిస్తే మరణశిక్ష కూడా విధించేవారట. అంతలా ఆరాధించే ఈ జింకల సంరక్షణ కోసం చేసిన ఏర్పాట్లలో ఈ పార్కు ఒకటి. పచ్చని చెట్లతో పాటూ ఈ ఉద్యానవనంలో మ్యూజియాలూ, దుకాణాలూ, హోటళ్లూ... ఇలా చాలానే ఉంటాయి. వాటన్నింటి మధ్య పర్యటకులతో కలిసి ఎంచక్కా తిరుగుతుంటాయీ జింకలన్నీ. సందర్శకులు కూడా వాటికి ఆహారం తినిపిస్తూ కాసేపు వాటితో సరదాగా ఫొటోలు దిగుతూ ముచ్చటపడిపోతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..