చెత్తలో పుట్టిన అందాల చిత్రం!

ఇక్కడున్న చిత్రాల్ని చూసి... ఆర్టిస్టు ఎవరో బొమ్మలు బాగానే వేశారు అని ఒక్కమాటలో తేల్చేస్తారేమో... కానీ ఈ పెయింటింగ్స్‌ గురించి అసలు విషయం తెలిశాక మాత్రం ‘వహ్వా’ అంటూ పొగిడేస్తారు.

Updated : 04 Jun 2023 06:47 IST

ఇక్కడున్న చిత్రాల్ని చూసి... ఆర్టిస్టు ఎవరో బొమ్మలు బాగానే వేశారు అని ఒక్కమాటలో తేల్చేస్తారేమో... కానీ ఈ పెయింటింగ్స్‌ గురించి అసలు విషయం తెలిశాక మాత్రం ‘వహ్వా’ అంటూ పొగిడేస్తారు. ఎందుకంటే... ఇవన్నీ కూడా చెత్తతో చేసిన కళాఖండాలు మరి. తుర్కియేకి చెందిన డేనిజ్‌ సాగ్‌డిక్‌ అనే ఆర్టిస్టు- తన కళతోనే ప్రజల్లో మార్పు తేవాలనుకుంది. అందుకే 2015 నుంచి ‘రెడీ-రీమేడ్‌’ అనే ప్రాజెక్టు ప్రారంభించి... వృథా వస్తువుల్నే వాడేస్తూ చూడచక్కని చిత్రాలుగా మారుస్తోంది. చెత్తడబ్బాలోకి చేరిన మందుబిళ్లలూ, సీసా మూతలూ, పాలిథిన్‌ కవర్లూ, పాత బట్టలూ, లెదర్‌ బ్యాగులూ, గుండీలూ, కేబుల్‌  వైర్లూ, బ్యాటరీలూ... ఇలా రకరకాల వృథా వస్తువుల్నే ముడిసరకుగా తీసుకుని ఈ వర్ణచిత్రాల్ని సృష్టించింది. పర్యావరణానికి హాని కల్గించే ఈ వస్తువుల వాడకం తగ్గించాలన్న తన ఆలోచనను బొమ్మలతో చూపాలని ఈ వెరైటీ చిత్రాల్ని తయారుచేస్తోంది. దీనికోసం ముందుగా వేయాలనుకున్న బొమ్మ రూపాన్ని గీసుకుని అందుకు సరిపోయే వ్యర్థాల్ని ఎంచుకుని ఒక్కోటిగా అతికిస్తూ ఓ అందమైన రూపాన్ని తెప్పిస్తుంది. మంచి సందేశాన్ని చక్కని కళలో చూపిస్తే... ఎవరినైనా ఆకట్టుకోకుండా ఉంటుందా... అందుకే డేనిజ్‌ చిత్రాల ప్రదర్శనలూ ప్రజలు మాట్లాడుకునేలా చేస్తున్నాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు