‘చిత్రం’ గా కాల్చారు!

కాగితం మీద పెన్సిల్‌తో ఓ అందమైన బొమ్మ గీయడమే అందరికి చేతకాదు. అలాంటిది అవేవీ లేకున్నా సరే... సూర్యుడి నుంచి వచ్చే వేడి, ఒక భూతద్దం ఉంటే చాలు... చెక్కపైన చక్కని చిత్రాన్ని గీసి చూపిస్తాం అంటున్నారు కొందరు ఆర్టిస్టులు. ఇదిగో ఇక్కడున్న అందమైన ప్రకృతి దృశ్యాలూ మనుషుల చిత్రాలూ... అన్నీ అలా గీసినవే. సన్‌లైట్‌వుడ్‌ బర్నింగ్‌, సోలార్‌ పైరోగ్రఫీ అంటూ పిలిచే ఈ ఆర్ట్‌ చాలా అరుదైన కళ. ఎంతో ఓర్పూ నేర్పూ ఉన్న కళాకారులకే ఇది సాధ్యం.

Published : 04 Feb 2024 00:59 IST

కాగితం మీద పెన్సిల్‌తో ఓ అందమైన బొమ్మ గీయడమే అందరికి చేతకాదు. అలాంటిది అవేవీ లేకున్నా సరే... సూర్యుడి నుంచి వచ్చే వేడి, ఒక భూతద్దం ఉంటే చాలు... చెక్కపైన చక్కని చిత్రాన్ని గీసి చూపిస్తాం అంటున్నారు కొందరు ఆర్టిస్టులు. ఇదిగో ఇక్కడున్న అందమైన ప్రకృతి దృశ్యాలూ మనుషుల చిత్రాలూ... అన్నీ అలా గీసినవే. సన్‌లైట్‌వుడ్‌ బర్నింగ్‌, సోలార్‌ పైరోగ్రఫీ అంటూ పిలిచే ఈ ఆర్ట్‌ చాలా అరుదైన కళ. ఎంతో ఓర్పూ నేర్పూ ఉన్న కళాకారులకే ఇది సాధ్యం. ఇక కళ విషయానికి వస్తే... పల్చని చెక్క బోర్డు మీద గీయాలనుకున్న బొమ్మ ఆకారాన్ని ముందుగా గీసుకుని ఆ తర్వాత భూతద్దం ద్వారా దానిపైన సూర్యకిరణాలు పడేలా చేస్తూ... కలపను కాల్చుతూ చూడచక్కని చిత్రాన్ని సృష్టిస్తారు. ఈ సన్‌లైట్‌ ఆర్ట్‌తో- జుత్తూ కళ్లూ చర్మం... ఇలా వేరు వేరు భాగాలకు సరిపోయే షేడ్స్‌ను తీసుకువస్తూ అచ్చంగా ఆ రూపాన్ని తేవడం ఎంతో కష్టం. అందుకే మరి ఈ బొమ్మల్ని చూసిన వెంటనే కాకుండా, వాటిని వేసిన కళ గురించి తెలిశాక కళ్లు ఇంతలు చేసుకుంటారు ఎవరైనా సరే!









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..