ప్రకృతి అందాలను నెలవు.. మలోజా పాస్‌

ఐరోపాలోని ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లో ఉన్న ‘మలోజా పాస్‌’ ఇది. స్విట్జర్లాండ్‌, ఇటలీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతం ఏడాదంతా పచ్చదనంతో కనువిందు చేస్తూ... చలికాలంలో మంచు దుప్పటిని కప్పుకుంటుంది.

Updated : 04 Feb 2024 05:29 IST

 

రోపాలోని ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లో ఉన్న ‘మలోజా పాస్‌’ ఇది. స్విట్జర్లాండ్‌, ఇటలీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతం ఏడాదంతా పచ్చదనంతో కనువిందు చేస్తూ... చలికాలంలో మంచు దుప్పటిని కప్పుకుంటుంది. ఈ దారిలో ఎక్కువగా హెయిర్‌పిన్‌ బెండ్‌లు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్తుంటే సరస్సులూ కనిపిస్తాయి. సముద్ర మట్టానికి ఆరువేల అడుగుల ఎత్తుకు వెళ్లాక... స్కీయింగ్‌ క్రీడకు ప్రసిద్ధి చెందిన స్విస్‌ పట్టణాలు వస్తాయి. ఏడాది పొడవునా, రేయింబగళ్లూ ఈ దారిలో పర్యటకులు తిరుగుతూనే ఉంటారు. అందుకే విద్యుద్దీపాల్నీ ఏర్పాటుచేశారు. ఒకే ప్రాంతం... కాలాన్నీ వేళల్నీ బట్టి ఇలా రంగులు మారుతుందన్నమాట. ఈ దారిలో ప్రయాణించేవాళ్లు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ... గమనమే గమ్యంగా సాగిపోతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..