సీతాకోక కజ్జికాయ తింటారా!

త్రిభుజాకారంలో ఉండే సమోసా... పువ్వు రూపంలో కనిపిస్తే, నెలవంకలా ఉండే కజ్జికాయ... సీతాకోక చిలుక ఆకారంలో ఉంటే... చూడ్డానికి సరదాగా అనిపించడమే కాదు, పిల్లలకు ఇష్టంగానూ ఉంటుంది.

Updated : 11 Dec 2022 05:44 IST

సీతాకోక కజ్జికాయ తింటారా!

త్రిభుజాకారంలో ఉండే సమోసా... పువ్వు రూపంలో కనిపిస్తే, నెలవంకలా ఉండే కజ్జికాయ... సీతాకోక చిలుక ఆకారంలో ఉంటే... చూడ్డానికి సరదాగా అనిపించడమే కాదు, పిల్లలకు ఇష్టంగానూ ఉంటుంది. మీరు కూడా మీ చిన్నారుల కోసం ఇలా కజ్జికాయ, మోదక్‌, సమోసా, కచోరి లాంటి తీపీ, కారం పదార్థాల రూపాల్ని మార్చేసి కమ్మగానూ, కనువిందుగానూ చేయాలనుకుంటున్నారా...  అయితే ఈ ‘కిచెన్‌ డంప్లింగ్‌ మోల్డ్స్‌’ని వాడండి. చదరం, హృదయా కారంతో పాటు రకరకాల ఆకారాల్లో ఉన్నాయివి. వివిధ రంగుల్లో ప్లాస్టిక్‌, స్టీలుతో తయారై వస్తున్న ఈ అచ్చులు మార్కెట్లో దొరుకుతున్నాయి. పిల్లలకు ఏదో ఒకలా కాస్త తినిపించ డానికి రోటిన్‌ వంటకాల్నే, వైవిధ్యంగా చేయడానికి ప్రయత్నించే గృహిణులకు ఇవి మంచి ఛాయిస్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..