జూదాల్ని మరిపించే మందులు!

క్రికెట్‌ బెట్టింగో, కోడిపందేలో, పేకాటో... జూదాలకి అంతేలేదు. కుటుంబం వీధినపడటం నుంచీ జైలుకెళ్ళేదాకా... వాటివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా జూదం మానరు చాలామంది.

Published : 05 May 2024 00:31 IST

క్రికెట్‌ బెట్టింగో, కోడిపందేలో, పేకాటో... జూదాలకి అంతేలేదు. కుటుంబం వీధినపడటం నుంచీ జైలుకెళ్ళేదాకా... వాటివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా జూదం మానరు చాలామంది. మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పించడమే ఇప్పటిదాకా వీళ్ళకున్న చికిత్స. ఇకపైన మందులూ ఇవ్వొచ్చంటోంది తాజా పరిశోధన ఒకటి. ఇంగ్లండులోని సదరన్‌ హెల్త్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌కి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల బాధితులకి వాడే మందులు జూదరులపైనా పనిచేస్తున్నాయని తేల్చారు. మామూలుగా హెరాయిన్‌లాంటి మాదకద్రవ్యాలు మన మెదడులోని కొన్ని నాడుల్ని ప్రేరేపిస్తాయి. వాటిని ‘ఓపీఆయిడ్‌ రిసెప్టర్స్‌’ అంటారు. ఈ నాడులు మనల్ని ఆనందంలో ఓలలాడించే డోపమైన్‌ విడుదలకి కారణమవుతాయి. జూదంలో ఉండే ఉత్కంఠ, ఓడిపోతే పెరిగే పట్టుదల, గెలిస్తే మనం అదృష్టవంతులమన్న ఆనందం... ఇవి కూడా ‘ఓపీఆయిడ్‌ రిసెప్టర్స్‌’ను ప్రేరేపించి- డోపమైన్‌ను విడుదల చేస్తుండొచ్చని అనుమానించారు శాస్త్రవేత్తలు. అందుకే- మాదక ద్రవ్యాల బాధితులకి వాడే నాల్మెఫీమ్‌, నాల్‌ట్రెక్సోన్‌ మందుల్ని జూదంపైన మోజున్నవాళ్ళకి ఇచ్చారు. వాటిని వాడిన వాళ్ళలో చాలావరకూ జూదంపైన కోరిక తగ్గినట్లు గమనించారు. ఈ ఫలితాలతో మరింత పెద్దస్థాయిలో క్లినికల్‌ ట్రయల్స్‌కి వెళతామంటున్నారు శాస్త్రవేత్తలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..