అచ్చుతో కేకు అందంగా...

ఇప్పుడు ఇంట్లోనే కేకు చేయడం అనేది సర్వసాధారణమైంది. అందుకే చాలామంది గృహిణులు... సంతోషాన్నిచ్చే సందర్భాలన్నింటికీ సులువుగా ఎవరికివారు సరికొత్తగా ఆలోచిస్తూ కేకుల్ని తయారుచేస్తున్నారు

Published : 29 Jan 2023 01:06 IST

అచ్చుతో కేకు అందంగా...

ఇప్పుడు ఇంట్లోనే కేకు చేయడం అనేది సర్వసాధారణమైంది. అందుకే చాలామంది గృహిణులు... సంతోషాన్నిచ్చే సందర్భాలన్నింటికీ సులువుగా ఎవరికివారు సరికొత్తగా ఆలోచిస్తూ కేకుల్ని తయారుచేస్తున్నారు. అది గమనించే తయారీదారులు కూడా ఇంట్లోనే కేకును చేసుకోవడానికి వీలుగా ఎన్నెన్నో వస్తువుల్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అందులోకి వచ్చి చేరింది లేస్‌ మౌల్డ్‌ అనే వస్తువు ఒకటి. మామూలుగా  చేసిన కేకుకు మరింత అందం తేవాలంటే దీన్ని వాడేయొచ్చు. షుగర్‌, చాక్లెట్‌ లాంటి పదార్థాల్ని ఈ లేసు అచ్చుల్లో పోసి చక్కని డిజైన్‌ లేసును తయారుచేసుకుని, సాదా కేకు చుట్టూ పెట్టేయొచ్చు. తక్కువ సమయంలో అందర్నీ ఆశ్చర్యపరిచే కేకు సిద్ధం అయిపోతుందంతే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..