సౌర స్టవ్‌..!

సౌరవిద్యుత్తుతో నడిచే రకరకాల ఉపకరణాలు మనకు అందుబాటులోకి వచ్చేశాయి. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా

Published : 02 Apr 2023 00:53 IST

సౌర స్టవ్‌..!

సౌరవిద్యుత్తుతో నడిచే రకరకాల ఉపకరణాలు మనకు అందుబాటులోకి వచ్చేశాయి. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా వండివార్చడానికి స్టవ్‌ రూపంలోనూ ఇప్పుడు వంటింట్లోకి వచ్చేసింది ఈ టెక్నాలజీ. గ్యాస్‌, విద్యుత్తు వంటి వనరులు వృథా కాకుండా సౌరవిద్యుత్తుతో నడిచే కుకింగ్‌ టాప్‌ను డిజైన్‌ చేసి రూపొందించింది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌. ఈ స్టవ్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు, నేరుగా ప్యానెళ్లకు అనుసంధానించీ వాడుకోవచ్చు. ఈ మధ్యనే ‘ఇండియా ఎనర్జీ వీక్‌ 2023’లో ఆవిష్కరించిన ఈ స్టవ్‌ ప్రధానికి ఎంతగానో నచ్చేసింది. దేశవ్యాప్తంగా పలు గ్రామాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో పడింది ఆయిల్‌ కార్పొరేషన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..