గూడు బండ్లు కట్టుకుని...

అవన్నీ తమిళ నాడుకి చెందిన వ్యాపార కుటుంబాలు. వాళ్ళ ఇళ్ళలో అత్యాధునిక కార్లు ఒకటికి రెండుంటాయి. పిల్లల్లో చాలావరకూ అమెరికా, దుబాయ్‌, ఆస్ట్రేలియా అంటూ స్థిరపడ్డారు.

Updated : 21 May 2023 04:18 IST

అవన్నీ తమిళ నాడుకి చెందిన వ్యాపార కుటుంబాలు. వాళ్ళ ఇళ్ళలో అత్యాధునిక కార్లు ఒకటికి రెండుంటాయి. పిల్లల్లో చాలావరకూ అమెరికా, దుబాయ్‌, ఆస్ట్రేలియా అంటూ స్థిరపడ్డారు. ఎంతగా విదేశాల్లో స్థిరపడ్డా చైత్రమాసం (మనకి ఇది వైశాఖం. తమిళులకి చైత్రమాసం) మొదటి వారం సొంతూరికి వచ్చేస్తారు. అందరూ కలిసి కుటుంబ సమేతంగా తమ ఊరికి రెండొందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వైదీశ్వరన్‌ కోయిల్‌ ఆలయానికి వెళతారు. నిజానికి, ఆ వెళ్ళడంలోనే ఉంది వీళ్ళ ప్రత్యేకత. కారులో వెళితే కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకునే వీలున్న ఆ గుడికి వీళ్ళు ఎడ్లబండిపైన ఆరు రాత్రులు ప్రయాణిస్తారు! తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఉన్న పి.అళగాపురి అన్న గ్రామవాసులు ఏటా ఈ వింత ఆచారం పాటిస్తున్నారు. వీళ్ళ ప్రయాణం రాత్రిపూట మాత్రమే సాగుతుంది. ఉదయం ఏడుగంటలకి ఏ గ్రామం కనిపిస్తే అక్కడ దిగి రోజంతా మజిలీ చేస్తారు. అక్కడే కట్టెలపొయ్యితో వండుకుని తింటారు. రాత్రికాగానే ప్రయాణం మొదలుపెడతారు. నేటి ఆధునిక కాలంలో బ్యాటరీ లైట్స్‌ వచ్చినా... ఒకనాటి హరికేన్‌ లాంతర్లే వాడతారు. ఒకప్పుడు ఈ గ్రామం నుంచి వైదీశ్వరన్‌ కోయిల్‌లోని వైద్యనాథస్వామి దేవేరి తైయల్‌ నాయకి అమ్మవారికి సారె తీసుకెళ్ళేవారట. నాటి ఆచారాన్ని తు.చ.తప్పకుండా పాటించాలనే ఇలా చేస్తున్నామంటున్నారీ గ్రామస్థులు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..