రూ.వేలకోట్ల ఆస్తులు వదులుకుని.. మరో సిద్ధార్థుడిలా..

రాచరికాన్నీ, విలాసాల్నీ కాదనుకుని సన్యాసిగా మారిన గౌతమ బుద్ధుడు చరిత్రలో నిలిచిపోయాడు. అచ్చం ఆయనలాగే వేల కోట్ల ఆస్తుల్ని వదులుకుని సేవ చేయడానికి సన్యాసిగా మారాడో యువకుడు.

Updated : 30 Jul 2023 12:18 IST

రాచరికాన్నీ, విలాసాల్నీ కాదనుకుని సన్యాసిగా మారిన గౌతమ బుద్ధుడు చరిత్రలో నిలిచిపోయాడు. అచ్చం ఆయనలాగే వేల కోట్ల ఆస్తుల్ని వదులుకుని సేవ చేయడానికి సన్యాసిగా మారాడో యువకుడు. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్‌ కృష్ణన్‌ రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న ఆయన తన ఆస్తులన్నీ కొడుకు అజన్‌ సరిపన్యోకు అప్పగించాలనుకున్నాడు. కానీ, గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్‌ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న అజన్‌ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఓ మఠాధిపతిగా ఉన్నాడు. తమిళంతోపాటు మరో తొమ్మిది భాషల్లో ప్రావీణ్యం ఉన్న అజన్‌ ఇరవై ఏళ్లుగా ఇంటికి వెళ్లింది గానీ, విలాసాల్నీ అనుభవించిందిగానీ లేదు. అందుకే, ఆయన్ని అభినవ బుద్ధుడు అంటుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..