మసీదుకి ఆలయాల నుంచి సారె!

మామూలుగా ఆలయాల బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివార్లకి ఊరిపెద్దలు సారె పెట్టడం మనకి తెలిసిందే! కానీ- అక్కడేమో ఓ మసీదు ప్రారంభోత్సవానికి అన్ని ఆలయాల నుంచీ సారెలు తరలివెళ్ళాయి.

Published : 04 Feb 2024 02:08 IST

మామూలుగా ఆలయాల బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివార్లకి ఊరిపెద్దలు సారె పెట్టడం మనకి తెలిసిందే! కానీ- అక్కడేమో ఓ మసీదు ప్రారంభోత్సవానికి అన్ని ఆలయాల నుంచీ సారెలు తరలివెళ్ళాయి. తమిళనాడు శివగంగ జిల్లాలోని సాలెగ్రామం అన్న ఊరిలో ఈమధ్య ఓ పాత మసీదుని పునరుద్ధరించారు. దాని ప్రారంభోత్సవానికి ఊరందరూ ఒకతాటిపైకి వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాలూ చర్చ్‌ల వద్ద కూడా పెద్దబ్యానర్లు పెట్టారు. అందులో మూడుమతాలవాళ్ళూ కలిసే అందర్నీ ఆహ్వానిస్తున్నట్టు రాశారు! ఇక, ప్రారంభోత్సవానికి హిందూ కుటుంబాలవాళ్ళందరూ తాంబూలంతోపాటు కొబ్బరికాయలూ పండ్లతో పెద్ద ఎత్తున సారెతెచ్చి అక్కడున్న పెద్ద గుళ్ళలో

 

పెట్టి పూజలు చేశారు. పూజారుల నేతృత్వంలోనే వాటిని మసీదులోకి తీసుకెళ్ళారు. ఇలాగే క్రైస్తవులు పండ్లని తీసుకెళ్ళి చర్చ్‌లో ప్రార్థన చేయించి పాస్టర్‌తోపాటూ మసీదులోకి అడుగుపెట్టారు. ప్రార్థనలయ్యాక ఊళ్ళోని ఏడువేలమందికి అతిపెద్ద విందు ఏర్పాటుచేశారు... మతసమైక్యత అంటే ఇదేనని చాటారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..