భలే కానుక!

ఆ మాస్టారి పేరు మనోజ్‌కుమార్‌. ఈ ఏడాది మార్చ్‌లో స్కూల్‌ నుంఆ మాస్టారి పేరు మనోజ్‌కుమార్‌. ఈ ఏడాది మార్చ్‌లో స్కూల్‌ నుంచి రిటైర్‌ కాబోతున్నాడు.చి రిటైర్‌ కాబోతున్నాడు.

Published : 04 Feb 2024 02:10 IST

ఆ మాస్టారి పేరు మనోజ్‌కుమార్‌. ఈ ఏడాది మార్చ్‌లో స్కూల్‌ నుంచి రిటైర్‌ కాబోతున్నాడు. వెళ్ళేలోపు తమ స్కూలు పిల్లలకి ఓ మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. తనకి తెలిసిన మంచి కానుక గాంధీజీ స్వీయచరిత్ర రచన ‘సత్యశోధన’ పుస్తకమే. అయితే ఆ బడిలో ఉన్నది మొత్తం 2500 మంది పిల్లలు. సత్యశోధన పుస్తకం ధరేమో వందరూపాయలు. అంటే- పాతికవేలు. మొత్తానికి తన జీతంలో సగాన్ని ఖర్చుపెట్టాల్సి వచ్చినా అనుకున్నది చేశాడు. జనవరిలో పండగ సెలవులకని వెళ్ళిన పిల్లలు తిరిగి రాగానే పేరుపేరునా అందరికీ దాన్ని పంచాడు.

‘నేను వెళితేనేం- గాంధీ మీకు జీవితాంతం తోడుంటాడు’ అని అందులో రాశాడు. చిన్నపిల్లలేమోగానీ- కాస్త పెద్ద పిల్లలు మాత్రం ఆయన అభిమానానికి కన్నీళ్ళు పెట్టుకున్నారు. కేరళ కోళిక్కోడులోని రామకృష్ణ మిషన్‌ హైస్కూల్‌లో జరిగిందీ స్ఫూర్తిదాయక సంఘటన. ‘గాంధీజీ సత్యశోధన- ఈ వయసులోనూ నా జీవితానికి దిక్సూచిగా ఉంటూ వస్తోంది. అదే స్ఫూర్తి ఈ పిల్లల్లో ఒక్కరికి కలిగినా చాలు’ అంటున్నాడు మనోజ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..