అడవులకి అతని పేరు పెట్టారు!

మనదేశంలో అడవులకి మనుషుల పేర్లు పెట్టడం చాలా అరుదు! ఉత్తరాదిన జిమ్‌ కార్బెట్‌, దక్షిణాదిన అన్నా, రాజాజీ ఇలా ఏవో కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి.

Updated : 04 Feb 2024 21:45 IST

మనదేశంలో అడవులకి మనుషుల పేర్లు పెట్టడం చాలా అరుదు! ఉత్తరాదిన జిమ్‌ కార్బెట్‌, దక్షిణాదిన అన్నా, రాజాజీ ఇలా ఏవో కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ ఒడిశాలోని మూడు చిట్టడవులకి ఓ వ్యక్తిపేరుని పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఆయన పేరు మిత్రభాను నాయక్‌... ఓ మామూలు అడవి కాపలాదారు! ఒడిశాలోని కియాంజర్‌ జిల్లాలోని బెల్దా అనే రిజర్వ్‌ అడవి అక్కడి మైనింగ్‌ పనుల కారణంగా ఎడారిగా మారింది. దాన్ని మళ్ళీ అడవిగా మార్చేందుకు పదేళ్ళకిందట నడుం బిగించింది అటవీశాఖ. ఆ బాధ్యతని మిత్రభానుకి అప్పగించింది. తానూ, తనతోపాటున్న కొద్దిపాటి సిబ్బందీ ఆ పని పూర్తిచేయలేరని గ్రహించాడు మిత్రభాను. చుట్టుపక్కలున్న పల్లెలవాళ్ళనీ అతికష్టంపైన ఒప్పించి భాగస్వాముల్ని చేశాడు. అలా అందరూ కలిసి పదేళ్ళలో ఎడారిభూమిని నిండైన అడవిగా మార్చేశారు. ఇలా సుమారు 85 హెక్టార్ల అడవిని పునరుద్ధరించాడు మిత్రభాను. అందుకే మిత్రభాను-1,2,3 అని వాటికి నామకరణం చేసింది ఒడిశా ప్రభుత్వం! ఓ సామాన్య ఉద్యోగికి ఇంత గౌరవం దక్కడం అరుదే కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..