ఆ తల్లి పేరు దగ్గులవ్వ!

భక్తులకున్న రకరకాల అవసరాలని బట్టి దేవతలూ ఉంటారని మనకి తెలిసిందే! వీసాలు ఇప్పించే చిలుకూరు బాలాజీ నుంచి పరీక్షలు పాస్‌ చేయించే విశాఖ వినాయకుడిదాకా అలా మనకు చాలా గుళ్ళే పేరొందాయి.

Published : 11 Feb 2024 00:17 IST

క్తులకున్న రకరకాల అవసరాలని బట్టి దేవతలూ ఉంటారని మనకి తెలిసిందే! వీసాలు ఇప్పించే చిలుకూరు బాలాజీ నుంచి పరీక్షలు పాస్‌ చేయించే విశాఖ వినాయకుడిదాకా అలా మనకు చాలా గుళ్ళే పేరొందాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలోని ఆ గుడికీ ఓ ప్రత్యేకత ఉంది. అందులో కొలువైన దేవత పేరు దగ్గులవ్వ. పేరుకు తగ్గట్టే ఎటువంటి దగ్గు సమస్యలనైనా పోగొడుతుందన్నది భక్తుల విశ్వాసం. బేల మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ కాలనీలో ఉండే ఈ గ్రామదేవత ఆలయం అతిప్రాచీనమైందని అంటారు. జలుబు నుంచి న్యుమోనియాదాకా ఏ సమస్య కారణంగా దగ్గు వచ్చినా ఈ తల్లికి మొక్కుకుంటారు. పక్కనే ఉన్న పెన్‌గంగ నది నీటితో ఈ దేవతని అభిషేకించి... దాన్నే దగ్గు తీర్చే తీర్థంగా తీసుకుంటారు. వైద్యంతో అనారోగ్యం తగ్గాక అన్నదానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఆషాఢంలోనూ పెద్ద ఎత్తున పండగ చేస్తారు. బోనాలెత్తుతారు. ఈ ఆలయంలో ఈ మధ్యే కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేసి వైభవంగా ప్రాణప్రతిష్ఠ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..