ఈ మొక్క... గాలిని శుద్ధి చేస్తుంది!

స్నేక్‌ ప్లాంట్‌, మనీ ప్లాంట్‌... ఇలా కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయని పరిశీలనలూ చెబుతున్నాయి.

Updated : 28 Jan 2023 23:16 IST

ఈ మొక్క... గాలిని శుద్ధి చేస్తుంది!

స్నేక్‌ ప్లాంట్‌, మనీ ప్లాంట్‌... ఇలా కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయని పరిశీలనలూ చెబుతున్నాయి. మొత్తమ్మీద ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల గాలి స్వచ్ఛత పెరుగుతుందన్నది నిజం. అయితే తాజాగా పారిస్‌కు చెందిన నియోప్లాంట్స్‌ అనే బయోటెక్‌ కంపెనీ, ఏకంగా జన్యు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోథోస్‌(మనీప్లాంట్‌) మొక్కలో అదనంగా కొన్ని జన్యువులను చేర్చింది. నియో-పి1గా పిలిచే ఈ మొక్క, ఇంట్లో పెంచుకునే 30 మొక్కలకు సమానం. అంటే- ఆ మొక్కలన్నీ పీల్చుకునే ఫార్మాల్డిహైడ్‌, బెంజీన్‌, టోలీన్‌, జైలీన్‌... వంటి హానికర కర్బన పదార్థాలను ఇదొక్కటే తీసుకుంటుందట. మొక్కలో సహజంగా ఉన్న డీఎన్‌ఏకు అదనంగా కొన్ని జన్యువుల్ని చేర్చడంవల్ల అవి ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లు ఆయా కర్బన పదార్థాలను పీల్చుకుని, హానిరహితంగా మార్చి మొక్క ఉపయోగించుకునేలా చేస్తున్నాయి. అంటే, ఈ మొక్కలు గాల్లోని ఫార్మాల్డిహైడ్‌ను ఫ్రక్టోజ్‌గానూ బెంజీన్‌, టోలీన్‌... వంటి వాటిని అమైనో ఆమ్లాలుగానూ మార్చుకుంటాయి. కాబట్టి ఇలాంటి ఓ మొక్క ఇంట్లో ఉంటే గాలి స్వచ్ఛత గురించి చింతించాల్సిన అవసరం ఉండదు అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..