9 వేల అడుగులు తప్పనిసరి!

‘ప్రతి మనిషీ వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలి’ అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సూచన. కానీ మన భారతీయుల్లో యాభైశాతానికిపైగా అలా చేయరట. అందువల్లే- ఇక్కడ హృద్రోగ సమస్యలు ఎక్కువంటారు. 150 నిమిషాలని లెక్కపెట్టు కోలేకపోవడం, రోజుకి 30 నిమిషాలని ప్రత్యేకంగా కేటాయించకపోవడం ఇందుకో కారణమని చెబుతుంటారు వైద్యులు.

Published : 04 Feb 2024 00:03 IST

‘ప్రతి మనిషీ వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలి’ అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సూచన. కానీ మన భారతీయుల్లో యాభైశాతానికిపైగా అలా చేయరట. అందువల్లే- ఇక్కడ హృద్రోగ సమస్యలు ఎక్కువంటారు. 150 నిమిషాలని లెక్కపెట్టు కోలేకపోవడం, రోజుకి 30 నిమిషాలని ప్రత్యేకంగా కేటాయించకపోవడం ఇందుకో కారణమని చెబుతుంటారు వైద్యులు. అలాంటివాళ్ళకి రోజూ మన అడుగుల్ని లెక్కపెట్టే మొబైల్‌ ఆప్‌లు ఉపయోగపడతాయనీ సలహా ఇస్తుంటారు. ‘నిజంగానే వీటివల్ల ఆ ఉపయోగం ఉందా?’ అని తేల్చేందుకు అమెరికాలోని ఎంఐటీకి చెందిన పరిశోధకురాలు శివాంగి బాజ్‌పాయ్‌ నడుంబిగించారు. ఇండియా సహా 42 దేశాలకి చెందిన 20 వేలమందికి సంబంధించిన వ్యాయామం వివరాల్ని పరిశీలించారు. రోజూ ఆరు నుంచి 9 వేల అడుగులు నడిచేవాళ్ళలో హృద్రోగ సమస్యలు 60 శాతానికి తగ్గినట్టు తేల్చారు. భారతీయులు ఉద్యోగ విరమణ తీసుకున్నాక శారీరక శ్రమకి దూరమవుతున్నారనీ అలాంటివాళ్ళు ఇలా అడుగులు లెక్కేసుకుంటే ఎన్నో రుగ్మతలకి దూరంగా ఉండొచ్చనీ చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు