వేలిముద్రల్లోనూ ‘ఏఐ’ విప్లవం!

ఓ దొంగ ఉన్నాడు. అతనోచోట చోరీ చేసి తన ఎడమచేతి బొటనవేలి ముద్ర వదిలేశాడనుకుందాం. మరోచోట కుడిచేతి బొటనవేలి ముద్ర పడిందనుకుందాం. ఆ వేలిముద్రల్ని బట్టి ఆ రెండూ ఒకరివేనని ఇప్పుడున్న మన ఫోరెన్సిక్‌ సైన్స్‌ అనుకుంటుందా అంటే... అనుకోదు. ఆ రెండూ వేర్వేరు వ్యక్తులవనే భావిస్తుంది. ఎందుకంటే మనచేతుల్లోని పది వేళ్ళ ముద్రలూ వేటికవే ప్రత్యేకమని ఫోరెన్సిక్‌ సైన్స్‌ నమ్ముతుంది.

Published : 04 Feb 2024 00:09 IST

దొంగ ఉన్నాడు. అతనోచోట చోరీ చేసి తన ఎడమచేతి బొటనవేలి ముద్ర వదిలేశాడనుకుందాం. మరోచోట కుడిచేతి బొటనవేలి ముద్ర పడిందనుకుందాం. ఆ వేలిముద్రల్ని బట్టి ఆ రెండూ ఒకరివేనని ఇప్పుడున్న మన ఫోరెన్సిక్‌ సైన్స్‌ అనుకుంటుందా అంటే... అనుకోదు. ఆ రెండూ వేర్వేరు వ్యక్తులవనే భావిస్తుంది. ఎందుకంటే మనచేతుల్లోని పది వేళ్ళ ముద్రలూ వేటికవే ప్రత్యేకమని ఫోరెన్సిక్‌ సైన్స్‌ నమ్ముతుంది. కానీ అది తప్పని నిరూపిస్తోంది నేటి ఏఐ! సరిగ్గా చూడాలేకానీ- ఒకే వ్యక్తికి చెందిన వేలిముద్రల్లో పోలికలుంటాయని చెబుతోంది. అమెరికాలోని కొలంబియా ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలో అండర్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న గేబ్‌ గువా అనే విద్యార్థి దీన్ని నిరూపించాడు. ఇప్పటిదాకా ఉన్న పద్ధతిలో వేలి ముద్రల్లోని సన్నటి రేఖల అంచుల్ని(రిడ్జస్‌) మాత్రమే చూస్తూ వచ్చారట. ఏఐ వాటికి భిన్నంగా ముద్ర మధ్యలో ఉన్న వలయాలూ, వంపులపైన దృష్టి పెట్టి... ఒకే వ్యక్తికి చెందిన వేళ్ళమధ్య పోలికల్ని పసిగట్టేస్తోందట! ఈ పరిశోధనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్‌ విధానం పూర్తిగా మారిపోయే అవకాశముందని చెబుతున్నారు నిపుణులు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..