Weekly Horoscope: రాశిఫలం (డిసెంబరు 31 - జనవరి 6, 2024)

ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 31 Dec 2023 03:48 IST


అదృష్టయోగముంది. మంచి పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. విద్యాయోగం శుభప్రదం. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపార లాభం సూచితం. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేయండి. కార్యసిద్ధి ఉంటుంది. గురు, రాహు శ్లోకాలు చదువుకోండి, మనశ్శాంతి లభిస్తుంది.


అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పట్టుదలతో చేసే పనుల్లో ప్రగతి ఉంటుంది. విద్యలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నది సాధించాలంటే నిరంతర శ్రమ అవసరం. భూ గృహ వాహన యోగాలు అనుకూలం. గురు, శని, కేతు శ్లోకాలు చదువుకుంటే మంచిది.


విశేషమైన కృషితో విద్యలో రాణిస్తారు. అన్ని వైపులా అదృష్టయోగం కనిపిస్తోంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు. ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. పదవీలాభముంది. వ్యాపారంలో కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ధనలాభముంది. శని, కేతు శ్లోకాలు చదువుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది.


అదృష్టయోగముంది. విద్యార్థులకు గురుబలం మంచిచేస్తుంది. ఉన్నత విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో పదవీలాభాలున్నాయి. వ్యాపారపరంగా కలిసివస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తిలో పైకి వస్తారు. దైవబలం సహకరిస్తోంది. గురు, శని, రాహు గ్రహ శ్లోకాలు చదువుకోండి. కోరుకున్న రంగంలో అభివృద్ధి సాధిస్తారు.


మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి తగిన సమయం. సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆచరిస్తేనే లక్ష్యాలను సాధించగలరు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారయోగం బాగుంది. కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తొలగుతాయి. ప్రయత్నం బాగా చేయాలి. శని, రాహు, కేతు శ్లోకాలు చదివితే మేలు.


శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. అనేకమార్గాల్లో విజయాలు సాధించి అదృష్టవంతులు అవుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యా, ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. అధికార లాభం సూచితం. వ్యాపారంలో సుస్థిరత సాధిస్తారు. స్వయం ప్రతిభతో పదిమందికీ ఆదర్శంగా నిలుస్తారు. మరిన్ని శుభ ఫలితాలకై రాహు కేతువుల్ని ధ్యానించాలి.


శుభయోగాలున్నాయి. విజయావకాశాలు పెరుగుతాయి. బాగా కృషిచేసి విద్యలో రాణిస్తారు. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. కృషిని బట్టి రాజయోగాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో నైపుణ్యంతో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. శని, కేతువులను ధ్యానించండి, అభీష్ట సిద్ధి కలుగుతుంది.


బ్రహ్మాండమైన శుభఫలితాలున్నాయి. సరస్వతీ కటాక్షముంది. విద్యలో మనోభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగంలో అధికార లాభముంది. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోరికలు తీరతాయి. వస్త్ర ప్రాప్తి, వస్తు ప్రాప్తి ఉన్నాయి. వ్యాపారంలో క్రమంగా పైకి వస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. శని, రాహువులను ధ్యానించండి, సత్ఫలితాలుంటాయి.


విద్యార్థులకు అనుకూలమైన కాలం. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సరైన ప్రణాళికతో పనిచేస్తే ఉద్యోగంలో అధికారయోగం పొందవచ్చు. వ్యాపారంలో లాభాలున్నాయి. సుస్థిరత ఏర్పడుతుంది. వృత్తిలో మంచి గుర్తింపునీ ప్రతిఫలాన్నీ పొందుతారు. శని, రాహు శ్లోకాలు చదువుకోండి, లక్ష్మీకటాక్ష సిద్ధి కలుగుతుంది.


అదృష్టయోగముంది. విద్యా ఉద్యోగయోగాలు సంపూర్ణంగా ఉన్నాయి. పదోన్నతులు సిద్ధిస్తాయి. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాల్లో విజయం సూచితం. సకాలంలో చేసే పనుల వల్ల స్థిరమైన ఫలితం వస్తుంది. ఆశించిన ధనలాభం పొందుతారు. వృత్తిలో రాణిస్తారు. శని, కేతు, గురు శ్లోకాలు చదువుకోండి, మనశ్శాంతి లభిస్తుంది.


కాలం మిశ్రమంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. చిన్న పొరపాటు జరిగినా నష్టం ఎక్కువవుతుంది. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు. శని, రాహు, కేతువులను స్మరిస్తే మంచిది.


బుద్ధిబలంతో కార్యసిద్ధిని సాధిస్తారు. ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. ఆశయాలు నెరవేరతాయి. విద్యాయోగం అనుకూలం. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మేలుచేస్తాయి. వ్యాపారయోగం మిశ్రమం. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. సరైన ప్రణాళికలతో మంచి భవిష్యత్తును పొందవచ్చు. శని, రాహు, కేతు శ్లోకాలు చదువుకుంటే శుభం జరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..