Weekly Horoscope: రాశిఫలం (ఫిబ్రవరి 4 - 10)

ఈ వారం ఏ రాశివారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 04 Feb 2024 08:01 IST


అద్భుతమైన విజయం ఉంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. చేసే పనుల్లో స్పష్టత వస్తుంది. నైపుణ్యాలను పెంచుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. నూతన మార్గాలను అన్వేషించండి. ఏకాగ్రతతో ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు ప్రశంసలు ఉంటాయి. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఇష్టదేవతను దర్శించండి, కార్యసిద్ధి లభిస్తుంది.


పనులు ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. విఘ్నాలు ఎదురైనా సంకల్ప బలంతో అనుకున్నది సాధిస్తారు. సహనం అవసరం. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. ఆర్థికంగా బాగుంటుంది. కాలం వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి నిలపండి. విశాలమైన దృక్పథంతో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. సూర్యధ్యానం శక్తినిస్తుంది.సూర్యధ్యాన మంత్రం కోసం క్లిక్ చేయండి


కృషినిబట్టి ఫలితాలుంటాయి కాబట్టి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ప్రయత్నాలను కొనసాగించాలి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. దేనికీ వెనకడుగు వేయవద్దు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్ఫలితాలను సాధించాలి. ఆవేశంగా మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు శక్తినిస్తాయి. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


ఉత్సాహంగా పనులు ప్రారంభించండి, సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యకార్యాల్లో ధైర్యంగా ఉండాలి. నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయవద్దు. సంకోచం పనికిరాదు. కుటుంబసభ్యుల సూచనలు మేలుచేస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సకాలంలో పూర్తిచేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సమష్టి కృషి తోడ్పడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్టసిద్ధి ఉంది. గృహ వాహన భూ యోగాలు అనుకూలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక శక్తినిస్తాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలోనూ లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందిస్తారు. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.


ధనయోగముంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగి నష్టం వచ్చే అవకాశమూ ఉంది. జాగ్రత్త వహించాలి. కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి సకాలంలో బాధ్యతల్ని నిర్వర్తించాలి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పనులు వాయిదా వేయవద్దు. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే ప్రశాంతత లభిస్తుంది. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


శుభకాలం నడుస్తోంది. వ్యాపారంలో లాభాలున్నాయి. నూతనప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. సొంత నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు. అపోహలు తొలగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. న్యాయపరమైన విజయం ఒకటి ఉంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


అదృష్టం వరిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి. ఉద్యోగం శుభప్రదం. ధన ధాన్యాది లాభాలున్నాయి. పెట్టుబడులు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగంలో నూతనప్రయత్నాలు సఫలమవుతాయి. పోటీతత్వంతో పనిచేయడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. మహాలక్ష్మీధ్యానం శుభప్రదం.


వ్యాపారలాభాలున్నాయి. కృషి ఫలిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసి విజయాలు సాధించండి. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆశయసాధనలో పురోగతి ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. మీ వల్ల కొందరికి మేలుజరుగుతుంది. లక్ష్మీఅమ్మవారిని స్మరించండి, మంచివార్త వింటారు.


మనోబలంతో పనిచేయండి, విఘ్నాలను అధిగమించి విజయాలు సాధిస్తారు. సకాలంలో పనిచేయడం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం పనికిరాదు. ఉద్యోగంలో ఒత్తిడికి లోనైతే పొరపాట్లు జరుగుతాయి. సహనాన్ని పరీక్షించే పరిస్థితులుంటాయి. ఓర్పు వహించండి. నవగ్రహాలను దర్శిస్తే మేలు. నవగ్రహ శ్లోకాల కోసం క్లిక్ చేయండి


చంచలత్వం లేకుండా ఆలోచించాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ మనోబలంతో మీ బాధ్యతలను నిర్వర్తించండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. గిట్టనివారు ఇబ్బంది కలిగించాలని చూస్తారు. సహనంతో వ్యవహరించాలి. ఆర్థికంగా బాగుంటుంది. భూలాభముంది. ఆరోగ్యపరంగా ఒత్తిడికి గురికావద్దు. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.


ఉద్యోగఫలితాలు శుభప్రదం. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అభీష్టసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సుస్థిరత ఏర్పడుతుంది. ధనాన్ని పొదుపుగా వాడితే భవిష్యత్తు బాగుంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. సమస్యలు తొలగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..