weekly horoscope: రాశిఫలం (మే 14 - 20)

సంపదలు సమకూరతాయి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం, సంయమనం అవసరం.

Updated : 14 May 2023 11:55 IST


సంపదలు సమకూరతాయి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం, సంయమనం అవసరం. ప్రతి విషయంలోనూ నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి. శత్రువుల నుంచి ఆపద పొంచివుంది. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. ఈశ్వరారాధన శ్రేష్ఠం.


ఉత్సాహంగా పనులు ప్రారంభించి సకాలంలో పూర్తిచేయండి. ధర్మమార్గంలో నిర్ణయాలు తీసుకోండి. కొందరు చేసే అనుచిత వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆవేశం పనికిరాదు. సహనానికి పరీక్షా కాలమిది. ఆత్మస్థైర్యంతో వ్యవహరించండి, భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. రుణసమస్యలు పెరగకుండా చూసుకోండి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది.


ఉద్యోగం శుభప్రదం. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. ఇంటాబయటా కలిసివస్తుంది. ప్రణాళికతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. లక్ష్మీదేవిని దర్శించండి, విజయం లభిస్తుంది.


ఉద్యోగంలో కలిసివస్తుంది. అనుకున్నది సాధిస్తారు. అదృష్టయోగం ఉంది. చేతిలోని పని పూర్తయ్యేవరకూ వేరే పని ప్రారంభించవద్దు. తొందరపాటు పనికిరాదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యసిద్ధి లభించేవరకూ కృషిచేయాలి. సాంకేతికంగా ఇబ్బందులు రానివ్వద్దు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవాలి, రుణబాధలు తీరతాయి.

పనులు వాయిదా వేయవద్దు. నమ్మకంతో ముందు కెళ్లండి. ఆశయం నెరవేరేవరకూ శ్రమించాలి. న్యాయపరమైన విజయం ఒకటి లభిస్తుంది. మీ శ్రమకీ నిజాయతీకీ గుర్తింపు లభిస్తుంది. తగిన ప్రోత్సాహం ఉంటుంది. ఎదురుచూస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. సమష్టి నిర్ణయం మేలుచేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి, అదృష్టం వరిస్తుంది.


సకాలంలో పని పూర్తిచేయాలి. ఒత్తిడిని శాంత చిత్తంతో ఎదుర్కోవాలి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆత్మీయులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అపార్థాలకు తావీయవద్దు. గురుగ్రహ శ్లోకం చదువుకుంటే మంచిది.


ఆర్థికంగా శుభకాలం. అవసరాలకు డబ్బు అందుతుంది. మొహమాటంతో ఎదురయ్యే ఇబ్బందుల్ని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలి. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. చాకచక్యంగా పరిష్కరించుకోవాలి. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. దగ్గరివారితో విభేదాలు వద్దు. ఒక విషయంలో మేలు జరుగుతుంది. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మనోబలం లభిస్తుంది.


ఉద్యోగం శుభప్రదం. అధికారయోగం సూచితం. అభీష్టసిద్ధి కలుగుతుంది. ధర్మమార్గంలో పైకి వస్తారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వాహన సౌఖ్యముంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కీర్తి లభిస్తుంది. మీ వల్ల నలుగురికీ¨ మేలు జరుగుతుంది. లక్ష్మీ గణపతిని స్మరించండి, బంగారు భవిష్యత్తు లభిస్తుంది.


శుభయోగం ఉంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. అధికార యోగం సూచితం. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. నిరంతర సాధనతో ఒక విషయంలో విజయం సాధిస్తారు. అవరోధాలు తొలగుతాయి. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. ఆవేశం వల్ల అనర్థాలు కలుగుతాయి. నిదానంగా మాట్లాడాలి. ఇష్టదేవతను దర్శించండి, భవిష్యత్తు అనుకూలం.


వ్యాపారంలో విశేష ధనయోగం ఉంది. పరిస్థితులకు తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఉద్యోగంలో నిరుత్సాహం పనికిరాదు. ఎప్పటి పని అప్పుడే పూర్తిచేయాలి. తెలియని ఆటంకాలున్నాయి. సొంతనిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏ పనైనా ఇంట్లోవాళ్లకు చెప్పి చేయాలి. దగ్గరివారితో విభేదాలుంటే శాంతంగా పరిష్కరించుకోవాలి. సూర్యారాధన శక్తినిస్తుంది.


మంచికాలం. కర్తవ్య దీక్షతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. స్థిరచిత్తంతో వ్యవహరిస్తే త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది. అదృష్టయోగముంది. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త విషయాలను తెలుసు కుంటారు. బాధ్యతాయుతంగా తీసుకునే నిర్ణయాలు అద్భుతమైన విజయాన్నిస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. విష్ణుమూర్తిని స్మరిస్తే మేలు.


బ్రహ్మాండమైన వ్యాపారయోగం ఉంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విశేష ధనలాభం సూచితం. నూతన వస్తువాహన ప్రాప్తి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. ప్రారంభించిన పని సకాలంలో పూర్తవుతుంది. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. వేంకటేశ్వర స్వామిని స్మరించండి, విజయావకాశాలు పెరుగుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..