Weekly Horoscope: రాశిఫలం (జనవరి 14 - 20)

ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 14 Jan 2024 00:26 IST

ధనలాభముంది. ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ఏ విషయాన్నీ లోతుగా ఆలోచించవద్దు. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయాలి. మొదలుపెట్టిన పనుల్ని ఆపకుండా పూర్తిచేయండి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచితేనే లాభాలు సాధ్యం. ఇష్టదేవతను స్మరించండి, శుభవార్త వింటారు.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధపెట్టాలి. కాలం అనుకూలంగా లేదు. ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసు కోవాలి. నిర్ణయాల్లో స్పష్టత అవసరం. కొన్నివిషయాల్లో గందరగోళ స్థితి నెలకొంటుంది. కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు. ఓర్పు వహించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులు దగ్గరిదాకా వచ్చి ఆగిపోతాయి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


కృషిని బట్టి విజయం ఉంటుంది. చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలుపెట్టండి. వెనకడుగు వేయవద్దు. లక్ష్యం చేరువలోనే ఉంది. సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి. నిజాయతీ కాపాడుతుంది. ఒక ఆపద నుంచి బయట పడతారు. కుటుంబసభ్యుల సలహాతో లాభపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, మంచి జరుగుతుంది.


శ్రేష్ఠమైన ఫలితాలు ఉన్నాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఇబ్బందులు తొలగి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. లక్ష్మీదేవిని స్మరించండి, సమస్యలు పరిష్కారమవుతాయి.


మనోబలంతో పనులు ప్రారంభించండి. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పెట్టుబడులు విశేష లాభాన్నిస్తాయి. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. ఖర్చు విషయంలో కాస్త ఆలోచించాలి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతను స్మరించండి, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.


అదృష్టయోగం సూచితం. వ్యాపారంలో విశేష మైన గుర్తింపు లభిస్తుంది. ధనలాభముంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ఉద్యోగంలో మిశ్రమఫలితాలున్నాయి. దేనికీ వెనకడుగు వేయవద్దు. ఇష్టదేవతను స్మరించండి, శుభఫలితాలు సిద్ధిస్తాయి.


అదృష్టయోగముంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి. కల సాకారమవుతుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి. వ్యాపారంలో ఒత్తిడిలేకుండా వ్యవహరించాలి. లక్ష్మీధ్యానం చేయండి, జీవితం సంతృప్తికరంగా సాగుతుంది.


వ్యాపారలాభం సంపూర్ణం. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విభేదాలకు దూరంగా ఉండాలి. సున్నితంగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు జరిగినా సమస్య పెద్దదవుతుంది. కుటుంబసభ్యుల సహకారం అవసరం. ఇష్టదేవతను స్మరించండి, శక్తి లభిస్తుంది.


నిర్ణయాన్ని బట్టి ఫలితాలుంటాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శుభఫలితాలుంటాయి. మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తిచేయండి. మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి. పేరుప్రతిష్ఠలు సాధిస్తారు. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సూర్యుణ్ణి ధ్యానించండి, అభీష్ట సిద్ధి కలుగుతుంది.


ఆర్థికంగా కలిసివస్తుంది. తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధిచెందుతుంది. బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆవేశపరిచేవారున్నారు. శాంతంగా పనిచేయండి. వ్యాపారంలో నూతన ప్రయోగాలకు సమయం కాదు. నవగ్రహాలను స్మరిస్తే మంచిది.


ఉద్యోగంలో పదవీలాభం సూచితం. ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎదురుచూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. వ్యాపారయోగం బాగుంది. ఆర్థికంగా బలపడతారు. సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం. లక్ష్మీదేవిని దర్శించండి, నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి.


ఉద్యోగంలో ఆశించినది లభిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతనిస్తాయి. మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన ధాన్యాభివృద్ధి ఉంది. పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది. స్థిరచరాస్తులు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇష్టదేవతను స్మరించండి, శాంతి లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..