Weekly Horoscope: రాశిఫలం (జనవరి 21 - 27)

ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

Updated : 21 Jan 2024 00:28 IST


అదృష్టయోగాలున్నాయి. అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. ఉద్యోగులు క్రమంగా ఉన్నతస్థితి సాధిస్తారు. భాగ్య శుక్రయోగం వల్ల విశేష ధనలాభముంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త. ప్రారంభించిన పనుల్ని మధ్యలో ఆపవద్దు. ఒక సంఘటన కనువిప్పు కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.


ఆర్థికంగా మేలైన కాలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి. మాటని పొదుపుగా వాడాలి. ప్రణాళికతో పనిచేస్తే మేలు జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇష్టదేవతను స్మరించండి, ఆపద నుంచి బయటపడతారు.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. తొందర పడవద్దు. పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఎవరినీ నమ్మవద్దు. సొంత విషయాలు ఇతరులతో చర్చించవద్దు. ఎదురు చూస్తున్న పని ఒకటి ఆలస్యం అవుతుంది. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.


మనోబలంతో పనులు ప్రారంభించండి. ఆశయం సిద్ధించేవరకు కృషిచేస్తూనే ఉండాలి. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపవద్దు. విజయానికి చేరువలో ఉన్నారు. అభివృద్ధి సాధించడానికి సరైన సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారంలో శుభఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్య సాధనలో సమష్టికృషి అవసరం. ఇష్టదైవస్మరణ మేలుచేస్తుంది.


శ్రేష్ఠమైన శుభఫలితాలున్నాయి. అధికార లాభం సూచితం. స్థిరత్వం ఏర్పడుతుంది. సంకల్పబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరిస్తే మనశ్శాంతి లభిస్తుంది.


వ్యాపారలాభాలు శుభప్రదం. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రయత్నం విశేషంగా చేయండి. విజ్ఞానపరమైన అభివృద్ధి గోచరిస్తోంది. ఆశయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. సొంత నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఓర్పు, పట్టుదల మిమ్మల్ని కాపాడుతాయి. ఒక విషయంలో శుభవార్త వింటారు. శివారాధన శ్రేయస్సునిస్తుంది.


ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ధర్మమార్గంలో వాటిని అమలుచేయండి. ఆశించిన ఫలితాలు త్వరగా లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆత్మాభిమానాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించాలి. వ్యాపారంలో నష్టాలు గోచరిస్తున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేయాలి. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం.


ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది. అదృష్టయోగం సూచితం. అధికారుల అండదండలు లభిస్తాయి. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆదర్శవంతమైన జీవితం లభిస్తుంది. గృహ భూ వాహన యోగాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారలాభాలు విశేషం. మిత్రుల సహకారం లభిస్తుంది. లక్ష్మీదేవిని స్మరించండి, శుభవార్త వింటారు.


సంకల్ప సిద్ధి ఉంది. ఏకాగ్రతతో పని చేయండి. ఆశిస్తున్నది వెంటనే లభిస్తుంది. శాంతంగా సంభాషించండి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధన ధాన్యాభివృద్ధి సూచితం. ఆర్థిక పరంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. రుణసమస్యలు రానివ్వొద్దు. విష్ణుమూర్తిని స్మరించండి, ఆనందంగా గడుస్తుంది.


ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. నిర్ణయాలు తీసుకోబోయే ముందు లోతుగా ఆలోచించండి. మిత్రుల తోడ్పాటు అవసరం. పనులు సకాలంలో పూర్తిచేయండి. ఇతరుల విషయాల్లో తల దూర్చవద్దు. అపరిచితులను నమ్మవద్దు. ఇతరులకు ధనం ఇస్తే తిరిగి రాదు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.


ప్రయత్నాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది కాబట్టి విశేషంగా కృషిచేయండి. వ్యాపారంలో కలిసివస్తుంది. గృహ వాహన యోగాలు శుభ ఫలితాలనిస్తాయి. పెట్టుబడులు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. చెడు ఊహించవద్దు. సూర్యభగవానుని ధ్యానించండి, విఘ్నాలను అధిగమిస్తారు.


ఉద్యోగంలో సత్ఫలితాలు సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక ఆపద నుంచి బయటపడతారు. న్యాయపరమైన లాభాలున్నాయి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. వ్యాపారంలో జాగ్రత్త. సరస్వతీధ్యానం సమయస్ఫూర్తినిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..