Weekly Horoscope: రాశిఫలం (మార్చి 26-ఏప్రిల్ 1)
Weekly Horoscope: 12 రాశులవారి ఈ వారం రాశి ఫలం వివరాలు...
Weekly Horoscope: రాశిఫలం (మార్చి 26-ఏప్రిల్ 1)
ఉద్యోగం శుభప్రదం. సకాలంలో పని ప్రారంభించి త్వరగా విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సంకల్పం సిద్ధిస్తుంది. పట్టుదలతో చేసే పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. ఉత్సాహంగా ఆలోచించాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లాలి. ఆదిత్యహృదయం చదివితే శుభం జరుగుతుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధిచెందుతుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. అధిక ధనలాభాలున్నాయి. దైవబలంతో ఆపదలనుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వారాంతంలో శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి, మేలు జరుగుతుంది.
ఉద్యోగం బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. పనులు త్వరగా పూర్తవుతాయి. ధనయోగం ఉన్నప్పటికీ అవసరాలకు మించి ఖర్చులు చేయవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్త. ధర్మమార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలి. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. శివారాధన శ్రేష్ఠమైన ఫలితాన్ని ఇస్తుంది.
అదృష్టయోగం ఉంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకోండి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయడం వల్ల త్వరగా విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. వారం మధ్యలో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇంట్లోవారి సూచనలతో మేలు జరుగుతుంది. సూర్యుణ్ణి ధ్యానిస్తే మంచిది.
శుభఫలితముంది. ఉద్యోగంలో బాగుంటుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. వ్యాపారంలో శ్రద్ధపెంచాలి. ఆత్మాభిమానంతో పనిచేయండి కానీ ఎవరి మాటల్నీ మనసుకు తీసుకోవద్దు. ఎదురుచూస్తున్న పనిలో విజయం ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. అదృష్టయోగముంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. సూర్యదేవుడి దర్శనం శుభప్రదం.
మంచి నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. ఆర్థికంగా బాగుంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. లక్ష్యాన్ని త్వరగా చేరతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆత్మాభిమానం రక్షిస్తుంది. బంధు మిత్రులతో సౌమ్యంగా సంభాషించాలి. ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి. విష్ణు సహస్ర నామం చదువుకోండి, శుభవార్త వింటారు.
ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం సూచితం. ఏకాగ్రతతో పనిచేయాలి. చంచల నిర్ణయాల వల్ల కష్టాలు ఎదురవుతాయి. ధైర్యంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. శాంతంగా ఆలోచించండి. నవగ్రహ శ్లోకాలు చదివితే శుభం జరుగుతుంది.
సకాలంలో పని ప్రారంభించండి. దైవబలంతో పూర్తిచేయగలుగుతారు. మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. పట్టుదలతోనే కార్యసిద్ధి. చంచల నిర్ణయాలు వద్దు. వారం మధ్యలో ఒక సమస్య ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబసభ్యుల ప్రమేయంతో మేలు జరుగుతుంది. వ్యాపారం జాగ్రత్తగా చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తే మనశ్శాంతి లభిస్తుంది.
అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. విశేష ప్రయత్నంద్వారా అధిక ధనలాభం సిద్ధిస్తుంది. నిరంతర కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది. వ్యాపారంలో బలం పెరుగుతుంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వస్తువాహన ప్రాప్తి ఉంది. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివారాధన మేలు చేస్తుంది.
సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. ధైర్యంగా చేసే పనుల్లో విజయం త్వరగా లభిస్తుంది. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. సాంకేతిక లోపం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. వారాంతంలో శుభవార్త వింటారు. దుర్గాదేవిని ధ్యానించండి, మనోబలం చేకూరుతుంది.
వ్యాపారంలో విశేష లాభాలు వస్తాయి. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఏకాగ్రతతో చేసే పనుల్లో అధిక లాభం ఉంటుంది. ధనయోగం శుభప్రదం. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. అదృష్టవంతులు అవుతారు. ఆదిత్య హృదయం చదువుకోండి, అంతా మంచే జరుగుతుంది.
ముఖ్యకార్యాల్లో శ్రద్ధ వహించండి. సకాలంలో పని ప్రారంభించడం మంచిది. ధనయోగం శుభప్రదం. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఒత్తిడి పెరగకముందే బాధ్యతలను పూర్తిచేయాలి. కొందరివల్ల సమస్య ఎదురవుతుంది. శాంత చిత్తంతో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni: ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’
-
Politics News
Harishrao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్: మంత్రి హరీశ్‌రావు
-
World News
China: బోయింగ్, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్ విమానం..!
-
India News
wrestlers Protest: పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. దిల్లీలో ఉద్రిక్తత!
-
Movies News
Shaakuntalam: ‘కేన్స్’లో శాకుంతలం మెరుపులు.. స్పందించిన సమంత
-
Health News
అశ్లీల చిత్రాలు తరచూ చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి!