గుంజీలు తీస్తే బస్సులో ఫ్రీ

చిన్నప్పుడు స్కూల్లో తప్పు చేస్తేనో, సరిగా చదవకపోతేనో గుంజీలు తీయించేవాళ్లు టీచర్లు. మరికొందరేమో భక్తితో వినాయకుడి ముందు గుంజీలు తీస్తుంటారు.

Published : 24 Dec 2022 23:50 IST

గుంజీలు తీస్తే బస్సులో ఫ్రీ

చిన్నప్పుడు స్కూల్లో తప్పు చేస్తేనో, సరిగా చదవకపోతేనో గుంజీలు తీయించేవాళ్లు టీచర్లు. మరికొందరేమో భక్తితో వినాయకుడి ముందు గుంజీలు తీస్తుంటారు. అయితే రొమేనియాలోని క్లూజ్‌ నపోకా నగరంలో మాత్రం గుంజీలు తీస్తే ఫ్రీగా ప్రభుత్వ రవాణాలో ప్రయాణించొచ్చు. అయితే, అక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది... కేవలం రెండు నిమిషాల్లో 20 గుంజీలు తీయాలి. అప్పుడే ఆటోమేటిక్‌ వెండింగ్‌ మిషన్‌ నుంచి ఫ్రీ టికెట్‌(హెల్త్‌ టికెట్‌) బయటకొస్తుంది. ప్రభుత్వ రవాణానీ ఆరోగ్యకర జీవనశైలినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమది. దాంతో ఆ నగరమంతా ప్రతి బస్‌స్టాప్‌లోనూ ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లను ఏర్పాటు చేశారు. యువత పోటీ పడి మరీ గుంజీలు తీస్తూ హెల్త్‌ టికెట్లు సొంతం చేసుకుంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..