కేంద్రం దృష్టికి బాధితుల సమస్యలు తీసుకెళ్తాం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో వరద బాధితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర బృందం సభ్యుడు రవినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. వరద

Published : 11 Aug 2022 03:30 IST

కూనవరం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో వరద బాధితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర బృందం సభ్యుడు రవినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం కూనవరం మండలంలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌తో కలిసి కేంద్ర బృందం పర్యటించింది. కూనవరం మండలంలోని శబరి కొత్తగూడెంలో వరద బాధితులతో వారు మాట్లాడారు. కేంద్ర బృందం సభ్యుడు మురుగునాథమ్‌, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు సూరజ్‌ గనోరే, రామశేషు, ఓఎస్డీ కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్యాకేజీ ఇవ్వండి.. వెళ్లిపోతాం: కేంద్ర బృందం ఎదుట వరద బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో వరద తీవ్రత పెరిగిందని వాపోయారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించి పునరావాసం కల్పించాలని..తమ గ్రామాలను 41.5 కాంటూరులో చేర్చి పరిహారం అందించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని