ఎన్నారైలో ముగిసిన ఈడీ తనిఖీలు

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్నారై అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనిఖీలు శనివారం ముగిశాయి.

Updated : 04 Dec 2022 06:07 IST

పలు దస్త్రాలు పట్టుకెళ్లిన అధికారులు

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్నారై అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనిఖీలు శనివారం ముగిశాయి. రెండురోజులుగా సాగిన ఈ తనిఖీల్లో భాగంగా పలు రిజిస్టర్లు, దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని పట్టుకెళ్లారు. దిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు శుక్రవారం నుంచి ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్నాయి. తొలిరోజు ఉదయం 10.30కు ప్రారంభించి అర్ధరాత్రి వరకు కొనసాగించారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. శనివారం నలుగురు అధికారులు రెండు బృందాలుగా రికార్డులు పరిశీలించి, కొందరు ఉద్యోగులను విచారించారు. ఎకౌంట్స్‌, హెచ్‌ఆర్‌ అధికారుల నుంచి ఆస్పత్రి, కళాశాల నిర్వహణ సమాచారం సేకరించినట్లు  తెలిసింది. తనిఖీలు ముగించుకుని వెళ్లేటప్పుడు అధికారులు కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. కొందరు ఇన్‌పేషెంట్‌, అవుట్‌ పేషెంట్ల కేస్‌షీట్లనూ తీసుకెళ్లినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని