Brother Anil Kumar: ‘పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుణ్నని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు’

తమ స్వార్థం కోసం ప్రభుత్వమిచ్చే పథకాలపై  ప్రజలు ఆధారపడొద్దని ముఖ్యమంత్రి జగన్‌ బావ, పాస్టర్‌ బ్రదర్‌ అనిల్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

Updated : 16 Dec 2022 10:44 IST

ప్రభుత్వం స్వార్థం కోసం ఇచ్చే పథకాలపై ఆధారపడొద్దు
విశాఖలో బ్రదర్‌ అనిల్‌కుమార్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే: తమ స్వార్థం కోసం ప్రభుత్వమిచ్చే పథకాలపై  ప్రజలు ఆధారపడొద్దని ముఖ్యమంత్రి జగన్‌ బావ, పాస్టర్‌ బ్రదర్‌ అనిల్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా భీమిలి మండలంలోని ‘క్రైస్ట్‌ కేర్‌ అండ్‌ క్యూర్‌ మినిస్ట్రీస్‌’లో క్రిస్మస్‌ సందర్భంగా నిర్వహించిన ప్రార్థన కూడికకు గురువారం ఆయన హాజరై మాట్లాడారు. దేవుడి పథకాలు వేరేగా ఉంటాయని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుణ్ననే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. ఎక్కడా సీఎం పేరు గానీ, ఆయన పార్టీ పేరు గానీ ఎత్తకుండానే ప్రభుత్వం, ప్రభుత్వాలు అంటూ తన దైవ వాక్యం మధ్యమధ్యలో ఆయన పలుమార్లు చేసిన విమర్శలకు హాజరైనవారు చప్పట్లు కొట్టారు. గత ఏడాది ఇక్కడికి వచ్చిన అనిల్‌కుమార్‌ అప్పట్లోనూ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని