Andhra News: కొడాలి నానిపై అరెస్టు వారెంట్ అమలుచేయాలి
గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌పేట సీఐ సురేష్‌కుమార్ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
గవర్నర్‌పేట సీఐని ఆదేశించిన న్యాయమూర్తి
విజయవాడ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉండటంతో గవర్నర్‌పేట సీఐ సురేష్‌కుమార్ గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్‌లో ఉందని, దాన్ని అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రీదేవి.. సదరు సీఐని ఆదేశించారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నించడం లేదంటూ పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మే 10న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్‌వేలో ర్యాలీ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న ఆరోపణలతో అప్పట్లో గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..
-
జాగ్రత్త.. ఎండార్స్ చేసినా కేసులు పెడుతున్నారు
-
పవన్ పర్యటన నేపథ్యంలో.. అర్ధరాత్రి హడావుడిగా రహదారి పనులు!
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
పసుపు బోర్డు ప్రకటన వచ్చె.. ఈ రైతు కాళ్లకు చెప్పులు తెచ్చె
-
ఎత్తిపోసేందుకు.. తెచ్చిపోశారు