Hormonal Contraceptive: గర్భ నిరోధానికి కొత్త సాధనం
గర్భనిరోధ పద్ధతుల్లో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం గర్భనిరోధానికి నోటిమాత్రలు, ఇంజెక్షన్లు, కాపర్-టి, కండోమ్ లాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు.
‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’ అమలుకు కేంద్రం చర్యలు
తెలుగు రాష్ట్రాలు సహా పలుచోట్ల అమలుకు ప్రయత్నాలు
ఈనాడు, అమరావతి: గర్భనిరోధ పద్ధతుల్లో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం గర్భనిరోధానికి నోటిమాత్రలు, ఇంజెక్షన్లు, కాపర్-టి, కండోమ్ లాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు. వీటికి అదనంగా మోచేతి చర్మం కింద పైపొరలో తేలికపాటి సూది మాదిరిగా ఉన్న సన్నటి సాధనాన్ని అమరుస్తారు. 3-4 సెంటీమీటర్ల పొడవు, 2-4 మిల్లీమీటర్ల మందంతో ఉండే ఈ సాధనం నుంచి గర్భాన్ని నిరోధించే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అసలీ సాధనమే హార్మోన్‌తో తయారవుతుంది. ఇది మహిళ అండాశయం నుంచి అండం ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. దీనివల్ల బిడ్డల మధ్య దూరం ఉండాలని కోరుకునే భార్యాభర్తలకు కలయిక సమయంలో ఎటువంటి అసౌకర్యం, సంకోచం ఉండదు. ఈ విధానాన్ని ‘సబ్ డెర్మల్ కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్’గా పేర్కొంటున్నారు. పాత విధానాల్లో ఉన్న ఇబ్బందులన్నింటినీ ఈ కొత్త విధానంతో అధిగమించవచ్చు.
మూడేళ్ల వరకూ పనిచేస్తుంది..
కొన్ని దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా.. తమిళనాడు, కర్ణాటక, అస్సాం, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, దిల్లీ రాష్ట్రాల్లో అమల్లోకి తేవడంపై సమాలోచనలు చేస్తోంది. ఈ సాధనాన్ని స్టాఫ్ నర్సులు సైతం అమర్చేలా వారికి శిక్షణ ఇస్తారు. ఈ విధానంలో మూడేళ్ల వరకు గర్భం రాకుండా భద్రత లభిస్తుంది. ప్రసవం జరిగిన వెంటనే, లేదా పాలిచ్చే తల్లులకూ ఈసాధనాన్ని అమర్చొచ్చు. కాపర్-టి విషయంలో మహిళలకు కనిపించే భయాలు ఈ విధానంలో ఉండవు. ఈ సాధనాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా తీసివేసే వీలుంది. దీన్ని తొలగించిన 48 గంటలతర్వాత గర్భం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంజెక్షన్‌ను సిరంజితో ఇచ్చినట్లే.. ఈ సాధనాన్ని చేతికి అమర్చేందుకు ప్రత్యేక సాధనం ఉంటుంది. కుడిచేతి వాటం వారి ఎడమ చేతికి, ఎడమచేతి వాటం ఉన్నవారి కుడిచేతికి చర్మం కింద దీన్ని అమరుస్తారు. కెన్యాలో 20-25 ఏళ్లుగా ఈ విధానం ఉంది. కొద్దికాలం కిందట కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ బృందం కెన్యాలో అధ్యయనం చేసి వచ్చింది. ఈ సాధనంతో దుష్ప్రభావాలు ఏవీ ఉండవని కేంద్రం పేర్కొంది. పెద్దరాష్ట్రాల్లో ప్రభుత్వాసుపత్రుల నుంచి గర్భనిరోధ పద్ధతులను అవలంబించేవారు ఏటా 5 లక్షలపైనే ఉంటున్నారని తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..