AP Inter: నేడు ఇంటర్‌ రీ వెరిఫికేషన్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు.

Updated : 16 May 2023 06:52 IST

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. బోర్డు వెబ్‌సైట్‌లో రోల్‌ నంబరు, పుట్టినతేదీ, రశీదు నంబరు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చని సూచించారు. రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జవాబు పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 18004257635లో సంప్రదించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని