Trains: ప్రకటనలో పొరపాటు.. రైలు ప్రయాణికులకు గ్రహపాటు

రైల్వే సిబ్బంది ఒకదాని బదులు మరొక ప్లాట్‌ఫారం నంబరు ప్రకటించడంతో 400 మంది ప్రయాణికులు రైళ్లను అందుకోలేకపోయారు.

Updated : 25 Jul 2023 10:11 IST

రేణిగుంట, న్యూస్‌టుడే: రైల్వే సిబ్బంది ఒకదాని బదులు మరొక ప్లాట్‌ఫారం నంబరు ప్రకటించడంతో 400 మంది ప్రయాణికులు రైళ్లను అందుకోలేకపోయారు. తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది. భువనేశ్వర్‌ వైపు వెళ్లాల్సిన రెండు రైళ్లు 5వ నంబరు ప్లాట్‌ఫారానికి రావాల్సి ఉండగా, సిబ్బంది 2వ ప్లాట్‌ఫారానికి వస్తాయని ప్రకటించారు. ప్రయాణికులంతా అక్కడకు చేరి ఎదురుచూస్తుండగా.. ఆ రైళ్లు రెండూ 5వ నంబరు ప్లాట్‌ఫారానికి వచ్చి వెళ్లిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని