యూరప్‌ వెళ్తా.. అనుమతించండి

విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 09 May 2024 06:57 IST

సీబీఐ కోర్టును అభ్యర్థించిన జగన్‌

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 17 నుంచి జూన్‌ 1వ తేదీ మధ్య యూరప్‌ వెళ్లడానికి అనుమతించాలని కోరారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌కు సీబీఐ కోర్టు షరతులపై బెయిలు మంజూరు చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా దేశం విడిచి వెళ్లరాదన్న షరతును సడలించాలని, యూరప్‌ వెళ్లడానికి అనుమతించాలంటూ సీబీఐ కోర్టును కోరారు. దీన్ని పరిశీలించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి టి.రఘురాం వివరణ ఇవ్వాలంటూ సీబీఐని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.

17 నుంచి యూరప్‌ పర్యటనకు జగన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, భారతి రెడ్డి దంపతులు ఈ నెల 17 లేదా 18న యూరప్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నెల 13న రాష్ట్రంలో పోలింగ్‌ జరగనుంది. అప్పటివరకూ ఎన్నికల ప్రచారం, పోలింగ్‌కు సమాయత్తంపై పార్టీ నేతలతో సమీక్షలతో హడావుడిగా ఉండడంతో పోలింగ్‌ పూర్తయ్యాక జగన్‌ యూరప్‌ వెళ్లనున్నారు. జెరూసలేం, లండన్‌, స్విట్జర్లాండ్‌లో వారు పర్యటించే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. లండన్‌లో వారి కుమార్తెలతో కలిసి గడిపేందుకు సీఎం దంపతులు ఈ పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం. ఈ నెల 30న లేదా జూన్‌ 1న తిరిగి రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని