Konaseema: ఏం జరిగిందో ఏమో గానీ..

‘నీటిలో ఉండలేక చుట్టపక్కాలింటికి సర్దుకుంటుంటాం. పొద్దున్నుంచి పడవలు లేవు. గ్రామం మునిగిపోతోందని, చచ్చిపోతున్నామని ఫోన్లు, వీడియోలు పంపుతున్నా ఎవరూ వినడం లేదు.

Updated : 02 Aug 2023 08:59 IST

సోమవారం అలా..

‘నీటిలో ఉండలేక చుట్టపక్కాలింటికి సర్దుకుంటుంటాం. పొద్దున్నుంచి పడవలు లేవు. గ్రామం మునిగిపోతోందని, చచ్చిపోతున్నామని ఫోన్లు, వీడియోలు పంపుతున్నా ఎవరూ వినడం లేదు. పడవలు లేవు, ప్రజలు ఏమైపోవాలి? గవర్నమెంటు గమనించాలి కదా? అవన్నీ లేకుండా దెబ్బలాడుతూ కూర్చుని, మేం అధికారం వెలగబెడుతున్నాం, ఏదో చేస్తున్నామంటే చెల్లదు కదా? ఊళ్లో కష్టసుఖాలు తెలుసుకోవాలి కదా? ఎక్కడెక్కడ జనం ఉండారో, ఎక్కడ నావలు అపాలో తెలుసుకోవాలి కదా?’ అని అప్పనరామునిలంకకు చెందిన పాపాయమ్మ సోమవారం వివరించారు.


మంగళవారం ఇలా..

మంగళవారం అధికారులు పాపాయమ్మ వద్దకు వెళ్లి మాట్లాడాక ఏం జరిగిందో ఏమో గానీ ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ఆమే ‘నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. ప్రభుత్వం సహకరించలేదని అనలేదు. నేను చెప్పిన మాటలు వేరు. విలేకర్లు చెప్పిన మాటల్ని బట్టి ప్రభుత్వాన్ని తప్పుపట్టొద్దు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది’ అని చెప్పటం గమనార్హం.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని