ఆ భూములు అధికారులే ఇచ్చారు!

తమ కుటుంబానికి అధికారులు ప్రభుత్వ భూములు కేటాయిస్తూ డీకేటీ పట్టాలిచ్చారని అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు.

Updated : 15 Aug 2023 05:55 IST

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: తమ కుటుంబానికి అధికారులు ప్రభుత్వ భూములు కేటాయిస్తూ డీకేటీ పట్టాలిచ్చారని అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. మేడా ఇంటి పేరుతో అతి పెద్ద కుటుంబం ఉందని, గతంలో తమ కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డీకేటీ భూములిచ్చారన్నారు. ‘ఈనాడు’లో సోమవారం ‘మేడా.. మేసేశారు!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిస్తూ రాజంపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తామెప్పుడూ ప్రభుత్వ భూములను స్వాహా చేయలేదని, తమ పొలాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములకు అధికారులు డీకేటీ పట్టాలిచ్చారన్నారు. ఈ భూముల విలువ పోల్చుకుంటే తమ కుటుంబంతో పాటు గుత్తేదారు కంపెనీ ద్వారా  దానధర్మాలకు వెచ్చించిన రూ.15 కోట్ల మొత్తం అతి పెద్దదని వివరించారు. తమ కుటుంబానికి ఇతరులను దోచుకోవడం.. అన్యాయం తలపెట్టడం తెలియదని మేడా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని