‘వార్త రాస్తే తోలు తీస్తా.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే లేపేస్తాం’

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 23 Jan 2024 03:38 IST

పాత్రికేయులపై విరుచుకుపడిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి

ఈనాడు, తిరుపతి: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి పట్టణంలోని శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఉందని చంద్రగిరి మండలం ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సమాచారం ఇవ్వడంతో 15 మంది పాత్రికేయులు అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వారిని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇంటికి వెళ్లిన విలేకర్లపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘నాపై వార్తలు రాసింది, సోషల్‌మీడియాలో పోస్టు చేసింది ఎవడ్రా? మీ ఇళ్లకు వచ్చి మీ కుటుంబసభ్యుల ముందే కాళ్లు, చేతులు విరుస్తా. ఏడేళ్లు నక్సలైట్‌గా పని చేసి వచ్చా. నాపై, నా కొడుకుపై తప్పుడు మెసేజ్‌లు పెడితే ఊరుకోను. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కఠిన చర్యలుంటాయి. తలకిందులుగా వేలాడదీసి చర్మం వలుస్తా. దీనికోసం కొందరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నా’ అని అంటూ ఇద్దరు విలేకర్ల పేర్లను ప్రస్తావిస్తూ బెదిరించారు. విలేకర్లు తిరిగి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పనుందంటూ తన కుమారుడు మోహిత్‌రెడ్డిని వెంట పెట్టుకుని కారులో వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని