ఏ కోడూ నాకు వర్తించదు.. నాపై ఎవరూ చర్యలు తీసుకోలేరు!

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో అసిస్టెంట్‌ మేనేజర్‌ క్యాడర్‌లో నాలుగేళ్లుగా ఉన్న పి.హేమంత్‌కుమార్‌రెడ్డి చాలాకాలంగా చిత్తూరు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Updated : 27 Mar 2024 06:09 IST

ఏపీఎండీసీ ఉద్యోగి ధీమా

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో అసిస్టెంట్‌ మేనేజర్‌ క్యాడర్‌లో నాలుగేళ్లుగా ఉన్న పి.హేమంత్‌కుమార్‌రెడ్డి చాలాకాలంగా చిత్తూరు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ఈయన ముఖ్య అనుచరుడు. ఏపీఎండీసీలో ఉద్యోగం చేస్తున్నట్లు రికార్డుల్లో చూపించి జీతం ఇస్తున్నారు. ఎప్పుడూ ఏపీఎండీసీలో ఉద్యోగం చేయకుండా వైకాపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఏ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న విషయం తెలిసిందే. వాలంటీర్లు ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిస్తేనే వారిని సస్పెండ్‌ చేస్తున్నారు. అయితే హేమంత్‌కుమార్‌రెడ్డి మాత్రం దర్జాగా వైకాపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తనకు ఎన్నికల కోడ్‌ వర్తించదని, తనపై చర్యలు తీసుకునే ధైర్యం ఏ అధికారికీ లేదనేలా ఆయన వైకాపా తరఫున ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది.. ప్రస్తుతం గనులశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయనకు కూడా ఈ ఉల్లంఘన కనిపించలేదా అన్న చర్చ ఏపీఎండీసీ వర్గాల్లో జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని