30న మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ బుధవారం వెల్లడించారు. ఈ సమావేశం వర్చువల్‌...

Updated : 20 Jan 2021 14:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ బుధవారం వెల్లడించారు. ఈ సమావేశం వర్చువల్‌  విధానంలో జరగనుందని తెలిపారు. ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు ఆహ్వానం పంపామన్నారు. ప్రతి పార్లమెంట్‌ సెషన్‌కు మందు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. కానీ, ఈ సారి దానికి భిన్నంగా సెషన్‌ 29వ తేదీనే మొదలవుతుండగా.. మీటింగ్‌ను మాత్రం 30వ తేదీన ఏర్పాటు చేశారు.

‘‘అఖిలపక్ష సమావేశం ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. ఈ సారి పార్లమెంట్‌ సెషన్‌లో అజెండాను పార్టీల ఎదుట ఉంచి.. వారి సలహాలను స్వీకరిస్తాం’’  అని జోషి పీటీఐకు వెల్లడించారు. 29వ తేదీన మొదలయ్యే బడ్జెట్‌ సెషన్‌ను రెండు భాగాలుగా నిర్వహించనున్నారు. తొలిభాగం ఫిబ్రవరి 15వ తేదీన ముగియనుంది. రెండో భాగం మార్చి 8వ తేదీన మొదలై.. ఏప్రిల్‌ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండు షిఫ్ట్‌ల్లో పార్లమెంట్‌ పనిచేస్తుంది. వీటిల్లో ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని